నితిన్ రూ.25 లక్షల విరాళం, జనం విమర్శలు

యంగ్ హీరో నితిన్.. జనసేన పార్టీ నిధికి రూ.25 లక్షల విరాళం ఇచ్చి మరో సారి వార్తల్లో నిలిచారు. సోమవారం రాత్రి భీమవరంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ని.. నితిన్ తండ్రి, నిర్మాత ఎన్. సుధాకర్ రెడ్డి కలిసి చెక్ అందచేశారు. డీ హైడ్రేషన్‌తో అస్వస్థతకు లోనైన పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘‘సోదరుడు నితిన్ నా ఆరోగ్యం గురించి వాకబు చేసినందుకు సంతోషంగా ఉంది. ఎంతో అభిమానంగా జనసేనకు విరాళం పంపించారు. నితిన్‌కు, సుధాకర్‌రెడ్డిగారికి కృతజ్ఞతలు’’ అని తెలిపారు.

ఇక ఈ నేపధ్యంలో ఈ విరాళం పై రకరకాల చర్చలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. పార్టి పెట్టిన ఇన్నాళ్లకు అదీ ఎలక్షన్ ముందు విరాళం ఇవ్వటంలో ఆంతర్యమేమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే అభిమానానికి టైమ్ ఏముంటుంది..ఇప్పుడు నితిన్ కు ఇవ్వాలనిపిస్తోంది. ఇచ్చాడు అని మరికొందరంటున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ అభిమానులను ఆకట్టుకోవటానికి ఇలా చేసాడని వేరే పార్టీలు వాళ్లు విమర్శిస్తున్నారు. ఏదైమైనా తన డబ్బు..తనిష్టం ..ఎవరికి ఎప్పుడు ఎందుకైనా ఇస్తారనేది నిజం. అందులో తప్పేమంది..ప్రతీది రచ్చ చేయటం తప్ప..ఏమంటారు.