వివాద‌స్ప‌ద హీరో త‌దుప‌రి చిత్రం…

                                                              (మోహన్ కుమార్) 

రీసెంట్‌గా విడుద‌లైన `ఆర్‌.ఎక్స్ 100` సినిమాతో సెన్సేష‌న‌ల్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్న హీరో కార్తికేయ‌. ఈ సినిమాను కార్తికేయ త‌న బ్యాన‌ర్‌పై నిర్మించ‌డం విశేషం. విమ‌ర్శ‌ల‌తో పాటు సినిమా స‌క్సెస్ కూడా అంతే రేంజ్‌లో వ‌చ్చింది. ఇప్పుడు ఈ సినిమాలో శివ పాత్ర‌లో న‌టించిన కార్తికేయ త‌న తదుప‌రి సినిమా వివ‌రాల‌ను తెల‌యజేశాడు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. ఇది ద్విభాషా చిత్రం కావ‌డ‌మే. సూర్య‌, జ్యోతిక‌, భూమికల‌తో నువ్వు నేను ప్రేమ చిత్రాన్ని తెరకెక్కించిన ద‌ర్శ‌కుడు టి.ఎన్‌.కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు కార్తికేయ‌. క‌లైపులి థాను ఈ సినిమాను నిర్మిస్తున్నాడట‌. ఆర్‌.రాజ‌శేఖ‌ర్ ఈ సినిమాకు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నార‌ట‌. క‌థ చాలా అద్భుతంగా ఉంది. సినిమా చేయ‌డానికి చాలా అతృత‌గా ఎదురుచూస్తున్నాన‌ని కార్తికేయ తెలియ‌జేశారు.