షాకింగ్ : బండబూతులు తిట్టిన నెటిజన్ కు హీరో కౌంటర్

అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు నటుడిగా పరిచయమైన రాహుల్ రవీంద్రన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత నటుడిగా పలు సినిమాల్లో నటించాడు. రాహుల్ ఇటీవల దర్శకుడిగా మారాడు. అక్కినేని  సుశాంత్ హీరోగా చి.ల.సౌ సినిమా ప్రారంభించారు. సిరుని కార్పొరేషన్ తో కలసి అన్నపూర్ణ సంస్థ ఈ సినిమాని తెరకెక్కించింది.

ఈ మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందుతుంది.అయితే సినిమా చూసిన ఒక ఆకతాయి  ట్విట్టర్ లో ”ఒక చెత్త సినిమా తీసినందుకు నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయిరా  హౌలే గా అంటూ రాహుల్ రవీద్రన్ ను  బండ బూతులు తిట్టాడు.

ఆ ట్విట్ చూసిన రాహుల్ రవీంద్రన్ ”నీ  పే.టీ.ఎం నెంబర్ పంపు. ఒట్టు నేను నీకు తిరిగి సెండ్ చేస్తా” అంటూ సింపుల్ గా  రిప్లై ఇచ్చాడు. కొద్దీ గంటలకు ఆకతాయి ఆ ట్విట్ ని డిలీట్ చేశాడు. డిలీట్ చేయడం ఆలస్యం అవ్వడం వల్ల నెటిజన్లు దానిని స్క్రీన్ షాట్ తీసి, ఆ ట్విట్ ని ట్రోల్ చేస్తున్నారు.