నడుము నొక్కాడు..చెంప పగలకొట్టా : నటి హేమ

నటి హేమ అంటే తెలియనివాళ్ళు ఉండరు. ఓ క్యారక్టర్ ఆర్టిస్ట్ అంతలా పాపులర్ తెచ్చుకోవటం అంటే గొప్ప విషయమే. అయితే ఆమె తెరపై ఉన్నంత అమాయికంగా అయితే బయిట ఉండరు. మాటలో ముక్కుసూటితనం, తేడా వస్తే తాట తీసే తత్వం ఆమె సొంతం అని ఆమెను ఎరిగున్నవాళ్లంతా చెప్తూంటారు. ఇదే విషయం రీసెంట్ గా ఆమె ఓ యూట్యూబ్ కు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పుకొచ్చింది. ఆ లేటెస్ట్ ఇంటర్వూకు సంభందించిన ప్రోమో చాలా ఆసక్తిగా ఉంది. అందులో పలు విషయాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి తన నడుము నొక్కిన వాడి, చెంప పగలకొట్టిన విషయం.

హేమ మాట్లాడుతూ…ఆ రోజు శ్రీహరిగారు చనిపోతే చూడటానికి వెళ్లాడు. వందలాది మంది జనం. ఆయన పార్ధివ దేహం చూడటానికి తోసుకుంటూ వెళ్తున్నారు. అక్కడ చాలా ఇరుకుగా ఉంది. ఆ టైంలో ఎవడో నా వెనుక నుండి వచ్చి ఒకే సారి..నా నడుముమీద చెయ్య వేసాడు. పట్టుకుని గిల్లాడు. వెంటనే వాడిని పట్టుకుని తుక్కు తుక్కు కింద బాదేశా. దబా దబా మని సౌండ్‌లు వచ్చేట్టు చితక్కొట్టా.అంతా అలా చూస్తుండిపోయారు. క్రిందకి నేను వెళ్లడానికి దారి ఇచ్చేశారంటూ’ ఆ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు హేమ.

ఇలాంటి ఎన్నో విషయాలు ఆమె ఈ ఇంటర్వూలో పాలుపంచుకున్నారు. ముఖ్యంగా త్రివిక్రమ్ సినిమాల్లో ఎందుకు నటించడం లేదు.. దర్శకుడు పూరీ జగన్నాధ్ – చార్మీ రిలేషన్‌ గురించి.. సీనియర్ నటి రమాప్రభతో వివాదం.. తనపై వచ్చిన రూమర్స్ తదితర విషయాలను ఈ ఇంటర్వ్యూలో ప్రస్తావించడంతో ఈ వీడియో ఇప్పటికే ఐదులక్షల వ్యూస్‌కి చేరువై వైరల్ అయ్యింది.