నటి హేమ చేరేది ఆ పార్టీలోనేనా ?

నటి హేమ చేరేది ఆ పార్టీలోనేనా ?

బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేటి అయినా నటి హేమ ఈరోజు తన మనసులోని మాటలను బయట పెట్టారు . సినిమా రంగం నుంచి త్వరలో రాజకీయాల్లోకి వెడుతున్నానని చెప్పారు . ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంటే తనకి ఎంతో ఇస్తామని చెప్పారు . అయితే తాను ఏ పార్టీలో చేరేది మాత్రం స్పష్టం చెయ్యలేదు . అయితే జగన్ మోహన్ రెడ్డి అంటే తనకి అస్తమని చెప్పింది అంటే ఆమె దృష్టి ఆ పార్టీ మీదనే ఉందనేది తెలుస్తుంది .

ఇక బిగ్ బాస్ హౌస్ లోపే జరిగిన అనేక విషయాలు చెప్పింది . తనకు మిగతా వారికి మధ్య పొంతన కుదర లేదని , బహుశా వయసురీత్యా అలా జరిగి ఉండొచ్చు అని చెప్పింది . ఇప్పుడు హౌస్లో వున్న వాళ్ళలాగా తనకి నటించమురాదు , నాటకాలు ఆడటం అంతకన్నా తెలియదని హేమ స్పష్టం చేసింది . ఇక అక్కినేని నాగార్జున అంటే తనకి చాలా చాలా ఇష్టమని తన మనసులోని మాట చెప్పేసింది . హేమ కు నాగార్జున అంటే ఎంత ఇష్టమో అనేక సినిమా కార్యక్రమాల్లో చూస్తూనే వున్నాము . నాగార్జున కనిపిస్తే చాలు వెళ్లి హాగ్ చేసుకుని తన అభిమానాన్ని తెలుపుతుంది .