టీజర్ బాగుంది కానీ… కాపీ అంటున్నారేంటి గురు?

రామ్‌ హీరో గా నటిస్తున్న కొత్త చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్ గా .. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా  ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. రొమాంటిక్‌ లవ్ స్టోరీగా ఈ సినిమా ఉండబోతోందని ఈ టీజర్ హింట్ ఇస్తోంది.

అక్కడవరకూ బాగానే ఉంది. ఇప్పుడు ఈ టీజర్ ని..విజయ్ దేవరకొండ సూపర్ హిట్ చిత్రం గీతాగోవిందం టీజర్ తో పోలుస్తున్నారు. యాజటీజ్ అదే ఫీల్ ని వర్కవుట్ చేసారని, పోలికలు చూపెడుతున్నారు.  ఇక్కడ అనుపమా పరమేశ్వరన్, అక్కడ రష్మిక అంటున్నారు. అలాగే స్లో మోషన్ షాట్స్, ఉదయం వాతావరణ చూపించే విజువల్స్, హీరోయిన్ గ్లామర్..రెండింటిలోనూ ఒకేలా ఉన్నాయి.

‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్  జరుపుకొంటున్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.