గ్లామర్ షోపై ఫోకస్! హెబ్బా పటేల్ 2.0!!

సోషల్ మీడియాలో హెబ్బాపటేల్ హంగామా!

 
తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో ప్రయత్నాలు మొదలెట్టిన హెబ్బాపటేల్, తాజాగా హాట్ ఫొటో షూట్ చిత్రాలు సోషల్ మీడియాకు వదిలింది. ఇప్పుడు ఆ ఫొటో షూట్ చిత్రాలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటూ తెగ హల్ చల్ చేస్తున్నాయి.  
 
టాలీవుడ్‌లో కుమారి 21 ఎఫ్‌తో  మంచి క్రేజ్ తెచ్చుకున్న హెబ్బాపటేల్, తరువాత అరడజనుకు పైగా అవకాశాలు అందుకుని సినిమాలు చేసింది కానీ సక్సెస్ కాలేదు. ఏంజిల్ సినిమా కూడా దెబ్బకొట్టడంతో కొంత గ్యాప్ తీసుకొని తాజాగా రీఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీతోనే గ్లామర్ షోపై ఫోకస్ పెట్టింది.
 
ఇప్పటికే వరుస హాట్ ఫొటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది.  ప్రస్తుతం తెలుగులో నాలుగు చిత్రాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, అందులో రెండు దాదాపు ఓకే   అయినట్టు సమాచారం.  ఇకనైనా  హెబ్బాపటేల్ కు  టాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తాయని, రాబోయే చిత్రాలతో హీరోయిన్ గా తనను తాను నిరూపించుకుంటుందని అనుకుందాం ఏమంటారు మరి మీరు!