కొత్తొక వింత.. పాతొక రోత! అన్నారు పెద్దలు. ఉన్నట్టుండి బీ-టౌన్‌లో కొత్తందం కనిపించేసరికి బాలీవుడ్ మీడియా గత కొంతకాలంగా ట్రామాలోకి వెళ్లిపోయిందట. అప్పట్లో ఓ సినిమా ప్రచారం కోసం వెళ్లిన సదరు బ్యూటీ బొద్దందాలు చూసి ముంబై మీడియా వాళ్లకు మతి చెడిందట. అసలు తాను ఎప్పుడొస్తుందో చూసుకుని మరీ వెంటపడడం స్టార్ట్ చేశారు.
మ్యాడమ్ మ్యాడమ్ అంటూ అదే పనిగా!
ఇలా కార్‌లోంచి దిగడమే ఆలస్యం.. అలా చిరునవ్వుల వరమిచ్చి మీడియా వాళ్లకు మతి చెడేలా చేసిందట. “మ్యాడం మ్యాడం మ్యాడం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ … “ అంటూ తన వెంటే పడ్డారు.. స్నాప్ లు మెరిపించారు. కెమెరాల్లో బంధించేందుకు ఒకరితో ఒకరు పోటీ పడ్డారు మరి. అయితే ఎవరినీ నిరాశపరచకుండా సదరు అందగత్తె అన్ని రకాలుగా కోఆపరేట్ చేయడం.. దాంతో ముంబై మీడియా మరింతగా జిగిరీ దోస్తీ అయిపోవడం ఇదంతా ఒకెత్తు అనుకుంటే.. అసలు సదరు అందగత్తె వయ్యారం చబ్బీ లుక్ కి పరేషాన్ అయిపోయారట అంతా.
బొద్దే ముద్దు బాబూ
అసలే ముంబై నగరంలో క్యాట్ వాక్ మోడల్స్ ని చూసి చూసి విసుగెత్తి పోయిన ముంబై మీడియా వాళ్లకు .. కేజీ కండ పుష్టి అయినా లేని కొకైన్ బ్రౌన్ సుగర్ మత్తు మొహాల్ని చూసి విసుగెత్తి ఉండడంతో ఈ బొద్దందం ఎంతో రీఫ్రెషింగ్ గానూ కనిపించిందట. మొత్తానికి అక్కడ మీడియా వాళ్లలో ఈ అందగత్తెపై ప్రత్యేకంగా డిస్కషన్ కూడా సాగిందని తెలుస్తోంది. ఏదైతేనేం ఉత్తరాది స్టార్ హీరోల్లో ది బెస్ట్ స్టార్ సౌత్ సూపర్ స్టార్ అంటూ బహిరంగ వేదికపై పరిచయం చేయడంతో ఉత్తరాది ప్రపంచం మొత్తం స్టన్ అయ్యి మరీ చూసింది. వెళుతూనే అక్కడ హిట్టు కూడా కొట్టింది ఈ చబ్బీ బేబీ. హ్యాట్సాఫ్ టు చబ్బీ బబ్లీ బూటీ.