నిజమైన ఆచార్య మీరే.. చిరుపై ప్రేమ కురిపించిన బన్నీ

HBD Megastar Chiranjeevi Allu Arjun

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా అల్లు అర్జున్ వెండితెరకు పరిచయమయ్యాడు. మొదటి సినిమా గంగోత్రిలో మామ పేరును బాగానే వాడుకున్నాడు. ఏకంగా మా మా మావయ్యది మొగల్తూరు అంటూ మామ మీద పాటే పాడేశాడు. అలా చిరంజీవి ఇమేజ్‌తో కెరీర్ ప్రారంభించినా అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుని సదరన్ స్టార్, స్టైలీష్ స్టార్‌గా అల్లు అర్జున్ ఎదిగాడు. చిరంజీవి ఎవరైనా ఏమైనా అన్నా, కించపరిచేలా చేసినా, తక్కువ చేసి మాట్లాడినా ఊరుకోడు.

HBD Chiranjeevi From Allu Arjun
HBD Chiranjeevi From Allu Arjun

మెగా ఫ్యామిలీలో అందరికీ కంటే చిరంజీవితోనే బన్నీకి ఎక్కువ అనుబంధం. చిరు అంటే బన్నీ మొహంలో ఏదో తెలియన కాంతి వెలుగుతుంది. మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మధ్య విబేధాలు వచ్చాయని, సపరేట్‌గా అల్లు కాంపౌండ్‌ను ఏర్పాటు చేసుకోవాలని బన్నీ ప్రయత్నిస్తోన్నట్టు వార్తలు వచ్చాయి. అవన్నీ ఎలా ఉన్నా, అందులో నిజమెంత ఉందని పక్కనబెడితే బన్నీకి చిరంజీవి అంటే ప్రాణం అన్నది నిర్వివాదాంశం. నేటి చిరు బర్త్ డేకు బన్నీ తన ప్రేమను చాటి చెప్పాడు.

అల్లు అర్జున్ తాజాగా చిరు బర్త్ డే స్పందిస్తూ.. ‘మన వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీ పట్ల నా హృదయం ఎప్పుడూ గౌరవం, ప్రేమ, కృతజ్ఞత భావంతో నిండి ఉంటుంది. నా జీవితంలోని ఎన్నో విషయాల్లో మీరు నిజంగా నా ఆచార్య’ అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇక నేడు ఆచార్య ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ రిలీజ్ కానుందని ఇలా పరోక్షంగా హింట్ ఇచ్చాడు. బన్నీ ఈ మధ్య నిహారిక నిశ్చితార్థపు వేడుకలో మెరిశాడు. బన్నీ స్టైలింగ్‌కు సోషల్ మీడియా షేక్ అయింది. అలా సతీసమేతంగా బన్నీ నడిచి వస్తున్న ఫోటోలు సోషల్ మీడియాను ఊపేశాయి.