శ‌త్రువుల‌కు స్పందించ‌ని మునీశ్వ‌రుడికి హ్యాట్సాఫ్‌!?

Pawan Kalyan plans big thing for Janasena

ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ర్సెస్ ఆర్జీవీ ఎపిసోడ్స్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఈయ‌న ఆయ‌న‌పై.. ఆయ‌న ఈయ‌న‌పైనా సినిమాలు తీస్తున్నారు. ఒక‌రిపై ఒక‌రు సెటైరిక‌ల్ విజువ‌ల్స్ ‌తో వేడెక్కించేస్తున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయ వైఫ‌ల్యంపై ఆర్జీవీ ప‌వ‌ర్ స్టార్ అనే సినిమా తీస్తుంటే .. ఆర్జీవీ పై ఏకంగా ప‌రాన్న జీవి అనే సినిమాని ప‌వ‌న్ అభిమానులు ప్రారంభించారు. ప్ర‌స్తుతం ఇరువురి న‌డుమ పోస్ట‌ర్ వార్ విజువ‌ల్స్ వార్ వేడెక్కిస్తోంది.

ఇక‌పోతే నిన్న‌టి ఎపిసోడ్ అభిమానులు అస‌లే మ‌ర్చిపోలేరు. ప‌వ‌ర్ స్టార్ ట్రైల‌ర్ లీక్ ఇచ్చి ఆర్జీవీ ప్ర‌చారం చేసుకున్న తీరు తాజాగా చ‌ర్చ‌కు వచ్చింది. ఆ ట్రైల‌ర్ ని కూడా రూ.25 / వ‌్యూకి అమ్ముకున్న ఆర్జీవీ ఓ ప్ర‌ముఖ మీడియాకి లీకిచ్చి ప్ర‌చారం చేయించుకున్నారు. ఇక ఈ ట్రైల‌ర్ లో ప‌వ‌న్ ని ఘోరాతిఘోరంగా అవ‌మానించే స‌న్నివేశాల‌కు కొద‌వేమీ లేదు. పంచ్ డైలాగుల‌తో ప‌వ‌న్ ని మ‌రిగించే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే ప‌వ‌న్ దీనికి స్పందించారా? అంటే స‌సేమిరా అనే చెప్పాలి. ఆయ‌న ఒక మునీశ్వ‌రుడిలా అస్స‌లు స్పందించిందే లేదు.

వకీల్ సాబ్ షూట్ ను తిరిగి ప్రారంభించడానికి ఎదురుచూస్తున్నందున పవన్ కళ్యాణ్ తన ఫామ్ హౌస్ లో ప్ర‌స్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. అతను మీడియాకు విడుదల చేసిన ఫోటోలలో పుస్తకాలు చదవడం.. ఖాళీ స‌మ‌యంలో తన పశువులను మేప‌డం తోట‌లో తిర‌గ‌డం కనిపిస్తోంది.

పవన్ పశువులకు మేత పెట్టడాన్ని ఎగతాళి చేస్తూ `గ‌డ్డి తింటావా?` అనే పాట‌ను క్రియేట్ చేశాడు ది గ్రేట్ క్రియేట‌ర్ రామ్ గోపాల్ వర్మ. అయితే దానికి ప‌వ‌న్ అస్స‌లు స్పందించ‌నే లేదు. ట్రైల‌ర్ కూడా చూసిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. ఇక ప‌వ‌న్ రిలీజ్ చేసిన తాజా ఫోటో చూస్తే తన పేరు మీద ఇంటర్నెట్ ట్రోల్స్ ని తాను పట్టించుకోనని పవన్ ఒక ప్రకటన చేస్తున్నట్లుగా ఉంది. ఈ ఫోటోలు రామ్ గోపాల్ వర్మకు కౌంట‌ర్ గానే అభిమానులు భావించి శాంతించాల్సి ఉంటుంది.

వర్మ వంటి శ‌త్రువు త‌న కోపాన్ని పోగొట్టుకోవ‌డానికి ప్రయత్నిస్తున్నప్పుడు పవన్ తన అభిమానులను వారి ప్రశాంతతను కోల్పోవద్దని అడుగుతున్నట్లుగా ఉంది అత‌డి వాల‌కం. అన్న‌ట్టు ఆర్జీవీపై ప‌గ తీర్చుకోవాలంటే సినిమా మాధ్య‌మంలో సెటైర్ వేయ‌డ‌మే క‌రెక్ట్ అని భావించి ప‌రాన్న జీవి తీస్తున్న సంగ‌తి విధిత‌మే. ఇప్ప‌టికే ఈ మూవీ పోస్ట‌ర్లు రిలీజై బోలెడంత ఫ‌న్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక నిఖిల్ లాంటి యువ‌హీరో ప‌వ‌న్ కి స‌పోర్ట్ చేస్తూ ఆర్జీవీపై కౌంట‌ర్లు వేస్తున్న సంగ‌తి తెలిసిందే.  కుక్క మొరిగితే శిఖ‌రం త‌ల తిప్పి చూడ‌దు అని నిఖిల్ ఇంత‌కుముందు ఆర్జీవీపై పంచ్ వేశాడు. వ‌ర్మ‌ను ఏకంగా కుక్క‌తో పోల్చ‌డంతో అది ప‌వ‌న్ అభిమానుల్లో వైర‌ల్ గా మారింది. వ‌ర్మ ఏదో చేస్తాడ‌ని ప‌వ‌న్ ప‌శువుల్ని మేప‌కుండా ఉంటాడా?  స‌హ‌జ‌సిద్ధ‌మైన త‌న వ్యాప‌కాల్ని వ‌దులుకుంటాడా?  ఆయ‌న ఒక తోట‌మాలి. వ్య‌వ‌సాయం ప‌శుపోష‌ణ వంటివి త‌న‌కు చిన్న‌ప్ప‌టి నుంచి ఇష్ట‌మైన ప‌నులు. ఆ ప‌నుల్లో ఆయ‌న య‌థావిథిగా బిజీ.

https://twitter.com/baraju_SuperHit/status/1285940337588887554/photo/4