గాసిప్స్ : మహేష్ బాబుకి మళ్ళీ సర్జరీ?? నిజమెంత..!

టాలీవుడ్ ఆల్ టైం హ్యాండ్సమ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం “సర్కారు వారి పాట” తో తన ఖాతాలో కాస్త ఓవరాల్ గా యావరేజ్ హిట్ నే అందుకున్నాడు. అయితే ఈ సినిమా కోసం మాత్రం మహేష్ బాగానే కష్టపడ్డాడు. సరికొత్త ఎనర్జీ తో ఆడియెన్స్ ను ముఖ్యంగా తన ఫ్యాన్స్ ని ఆకట్టుకునే విధంగా చాలా కాలం తర్వాత మంచి యాటిట్యూడిక్ నటనను కనబరిచాడు. 

అయితే ఈ సినిమా 90 శాతం కంప్లీట్ అయ్యిన సమయంలో తన మోకాలికి ఒక సర్జరీ చేయించుకున్నాడు. దీనితో రెండు నెలలు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ మహేష్ కి సర్జరీ అంటూ పలు క్లారిటీ లేని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో ప్రస్తుతానికి ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. 

మహేష్ తన వెకేషన్ లోనే ఉన్నాడని దీని తర్వాత వెంటనే జూలై లో త్రివిక్రమ్ తో సినిమాని స్టార్ట్ చేస్తున్నాడని తెలుస్తుంది. అయితే మహేష్ మళ్ళీ సర్కారు వారి పాట సాంగ్ షూట్ లో పాల్గొనడం వల్ల మళ్ళీ బెణికింది అంటున్నారు కానీ ఇది అవాస్తవం ని టాక్. నెక్స్ట్ అయితే త్రివిక్రమ్ సినిమా కోసం మహేష్ సిద్ధం గానే ఉన్నాడట. దీనిపై అయితే క్లారిటీ రావాల్సి ఉంది మరి.