గోపీచంద్ కు గత కొన్నేళ్లగా విజయాలు లేవు. లౌక్యం తర్వాత చెప్పుకోదగ్గ కమర్శిల్ హిట్టు ఒక్కటి కూడా లేదు. గౌతమ్ నందా యావరేజ్ గానే రాణించింది. అయితే అవకాశాలు మాత్రం ప్లాప్ లొచ్చినా తగ్గలేదు. ఏడాదికి ఒక సినిమా చొప్పునా చేసుకుంటూ వస్తున్నాడు. అయితే మార్కెట్ పరంగా గోపీచంద్ సినిమాలకు ఇబ్బందలు ఎప్పటికప్పడు తప్పడం లేదు. వరుస అపజయాల నేపథ్యంలో మార్కెట్ బాగా డౌన్ అయింది. హీరోగారి సినిమాలపై డిస్ర్టిబ్యూటర్లు అంత ఆసక్తి చూపించడం లేదని చాన్నాళ్లగా వినిపిస్తోంది. అయితే ఇటీవల రిలీజ్ అయిన చాణక్య సినిమాతో ఆ స్వరం మరింత పెరిగింది. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన సినిమా పెద్ద పరాజయాన్ని చవి చూసింది. మినిమం వసూళ్లు కూడా సాధించలేకపోయింది.
అదీ తెలుగు దర్శకుడిని కాదని తమిళ్ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చి మరి గోపీ అంటూ టీమ్ ముందుకెళ్లింది. కానీ ఫలితం నిరాశే మిగిల్చింది. దీంతో గోపీ చంద్ వైపు ఇప్పుడు అగ్ర సంస్థలేవి చూడటం లేదు. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో సిటీ మార్ అనే సినిమా చేస్తున్నాడు. చేతిలో ఉన్న ఒకే ఉన్న ఒకే ఒక్క సినిమా ఇది. అటు సంపత్ నంది పరిస్థితి అంతే. కమర్శియల్ సక్సెస్ లున్నా…రొటీన్ మేకర్ అన్న ట్యాగ్ తో సంపత్ అవకాశాలు అందుకోవడం వెలనుకబడ్డాడు.
ఈ నేపథ్యంలో సిటీమార్ తో భారీ హిట్టు కొడితేనే ఇద్దరి కెరీర్ ముందుకు సాగుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. గోపీచంద్ మార్కెట్ బాగా డౌన్ ఫాల్ లో ఉండటంతో సిటీమార్ సక్సెస్ అనివార్యమని…ఇందులో ఏ మాత్రం తేడా జరిగినా సదరు హీరో రిటైర్మెంట్ ప్రకటించడం ఉత్తమం అని టాక్ వినిపిస్తోంది. అయితే ఫెయిల్యూర్స్ లో… అదీ సినీ పరిశ్రమలో ఇలాంటి కామెంట్లు సహజం. ఓవర్ నైట్ లో స్టార్ ఎలా కాగలడో..పడి లేవడం అంతే సహజం.