ఈ సినిమా ఎంత పెద్ద విజయం అందుకుంది మనకు తెలిసిందే. దాంతో ఈ సినిమా సీక్వెల్ ను ప్రకటించాడు అడివి శేష్. నేటితో గూఢచారి రిలీజై ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా శేష్ నే సీక్వెల్ సంగతి ప్రశ్నిస్తే ఆసక్తికర సమాచారం అందించారు. హీరో కం రచయిత అడివి శేష్ వివరాల ప్రకారం.. ఎవరు, మేజర్ (మహేష్ బాబు నిర్మాత).. చిత్రాల తర్వాత గూఢచారి 2 ఉంటుందని తెలుస్తోంది.
ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు సాగుతున్నాయి. పీపుల్స్ మీడియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఎవరు
చిత్రం ఆగస్టు 15న రిలీజవుతోంది. ఆ తర్వాత సూపర్ స్టార్ ఎంబీ ప్రొడక్షన్ హౌస్ లో మేజర్
ప్రారంభం అవుతుంది. ఆ సినిమాని ఏడాది చివరిలో కానీ 2020 ప్రథమార్థంలో కానీ విడుదల చేస్తారు. అటుపై 2020 లోనే గూఢచారి చిత్రాన్ని ప్రారంభిస్తారని తెలుస్తోంది.