నాగ్ సినిమాకి భారీగా దెబ్బ కొట్టిన “గాడ్ ఫాదర్”..!

చాలా కాలం తర్వాత టాలీవుడ్ సినిమా దగ్గర పెద్ద హీరోస్ లో ఒకే రోజు సినిమాలు వచ్చి క్లాష్ అయ్యిన సందర్భాలు తక్కువ అవుతున్న తరుణంలో మెగాస్టార్ చిరంజీవి అలాగే అక్కినేని నాగార్జున లు నటించిన చిత్రాలు “గాడ్ ఫాదర్” మరియు “ది ఘోస్ట్” సినిమాలు రెండు కూడా ఒకే రోజు ఈ అక్టోబర్ 5న రిలీజ్ అయ్యాయి.

అయితే మొదటి రోజు ఈ సినిమాలకి కూడా మంచి ఓపెనింగ్స్ సాధించాయి. అయితే అప్పటి వారికీ బాగానే ఉంది కానీ రెండో రోజు విషయానికి వస్తే మాత్రం వీటిలో గాడ్ ఫాదర్ కి పర్వాలేదు కానీ ఘోస్ట్ పరిస్థితి బాగా డౌన్ అయ్యినట్టు తెలుస్తుంది. గాడ్ ఫాదర్ కి రెండో రోజు కేవలం 20 నుంచి 30 శాతం వసూళ్లు తగ్గగా ఘోస్ట్ కి మాత్రం సగానికి పైగా తగ్గిపోయాయి.

దీనితో ప్రేక్షకుల్లో గాడ్ ఫాదర్ కి ఎక్కువ మొగ్గు చూపుతున్నారని అర్ధం అవుతుంది. దీనితో అయితే గాడ్ ఫాదర్ దెబ్బకి ఘోస్ట్ వసూళ్లు బాగా దెబ్బ తిన్నాయని చెప్పాలి. మరి గాడ్ ఫాదర్ సినిమాని మోహన్ రాజా తెరకెక్కించగా ఘోస్ట్ సినిమాని ప్రవీణ్ సత్తారు తెరకెక్కించాడు. అలాగే గాడ్ ఫాదర్ లో సల్మాన్ కూడా కనిపించాడు.