`గీత‌గోవిందం`కు హైప్ తీసుకొస్తున్న లిప్‌లాక్ సీన్‌!

                                                                (ధ్యాన్) 

పెళ్ళిచూపులు` చిత్రంతో డీసెంట్ హిట్ అందుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు.. త‌ర్వాత వ‌చ్చిన `అర్జున్ రెడ్డి` స్టార్ స్టేట‌స్ తెచ్చేసింది. ఈ సినిమాలో హీరో పాత్ర యార‌గెంట్‌గా ఉండ‌ట‌మే కాదు.. లిప్‌లాక్‌ల‌తో రెచ్చిపోయాడు కూడా. అయితే ఇప్పుడు విజ‌య్‌దేవ‌ర‌కొండ న‌టించిన చిత్రం `గీత గోవిందం` రేపు విడుద‌ల కానుంది. బాధాక‌ర‌మైన విష‌య‌మేమంటే.. ఈ సినిమా విడుద‌ల‌కు ముందే పైర‌సీకి గురి కావ‌డం. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రంలో కూడా విజ‌య్ దేవ‌ర‌కొండ లిప్‌లాకింగ్‌తో రెచ్చిపోయాడు. ఇది లీకైన క్లిప్పింగ్స్‌లో స‌న్నివేశాల ద్వారా తెలిశాయి. చూస్తుంటే విజ‌య్‌, ర‌ష్మిక‌లు క్లైమాక్స్ సీన్‌లో బాగానే రెచ్చిపోయిన‌ట్లు క‌న‌ప‌డుతుంది.