“గీత గోవిందం” ఫస్ట్ డే కలెక్షన్స్

గీత గోవిందం మూవీ ఆగష్టు 15 న ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిట్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు కురిపిస్తోంది. ఈ సినిమాతో విజయ్ హ్యాట్రిక్ కొట్టాడు.

GG ట్రేడ్ అంచనాల ప్రకారం గీత గోవిందం సినిమా ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే 12-13 కోట్ల రూపాయల కలెక్షన్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. అమెరికా మార్కెట్లో 4,000 డాల్లర్లు కలెక్ట్ చేసింది.

హైద్రాబాదులో ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ చేయకపోవటం, ఉన్న కొన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కావడంతో అభిమానులు వెనుదిరిగి వెళ్లిపోయారు. దీంతో గురువారం మరి కొన్ని స్క్రీన్స్ యాడ్ చేసింది చిత్ర బృందం.