రంగుల ప్రపంచంలో కెరీర్ సాగే క్రమంలో స్నేహాలు ఆ తర్వాత కంటిన్యూ అయితే అది చాలా గొప్ప. అలాంటి స్నేహం రామ్ గోపాల్ వర్మ- మణిరత్నం మధ్య ఉంది. ఆ ఇద్దరూ ఒకరి సినిమాలకు ఒకరు సాయం చేసుకుంటుంటారు. ఐడియాలు మార్పిడి చేస్తుంటారు. ఇక ఆర్జీవీ- పూరి జగన్నాథ్ మధ్య గురుశిష్య బృందం తెలిసిందే. వీళ్ల మధ్య ఐడియాల షేరింగ్ .. ప్రచారార్భాటం తెలిసిందే. అప్పట్లో బిజినెస్ మేన్ ఐడియా ఆర్జీవీ ఇస్తే దానిని సినిమాగా తీసి బ్లాక్ బస్టర్ చేసాడు పూరి.
అయితే ఇక్కడ సన్నివేశంలో ఈ కొలీగ్స్ మాత్రం బద్ధవిరోధులవ్వడం చర్చనీయాంశమైంది. అతడు పెద్ద స్థాయికి ఎదిగాక స్నేహితుడిని మర్చిపోయాడట. పైగా అతడి గురించి చెడు ప్రచారం చేస్తున్నాడన్నది ఆరోపణ. ఇంతకీ ఎవరెవరి మధ్య గొడవ అంటే..? ఆర్జీవీ శిష్యులు అనురాగ్ కశ్యప్.. సినిమాటోగ్రాఫర్ నటరాజన్ సుబ్రమణియం మధ్య గొడవ.
అనురాగ్ వట్టి మూర్ఖుడు. అవివేకి.. స్వార్థపరుడు! అంటూ వేలెత్తి చూపాడు నటరాజన్. అతడి కోసం ఎంతో చేస్తే తనను పక్కన పెట్టేశాడని అసలు ఫ్రెండ్ సర్కిల్ లో ఎవరినీ దరి చేరనీయలేదని ఘాటుగానే ఆరోపించాడు. అన్నట్టు నటరాజన్ కి సినిమాటోగ్రాఫర్ గా పని చేసే అవకాశమే ఇవ్వలేదా? అందుకే అతడు ఇలా చెలరేగాడా? అన్నది తెలియాల్సి ఉంది. ఆ ఇద్దరూ ఆర్జీవీ `సత్య` సహా పలు చిత్రాలకు పని చేశారు. సత్య సినిమాతోనే అనురాగ్ రచయితగా పరిచయం అయ్యి అటుపై డైరెక్టర్ గా మారాడు. పెద్ద స్థాయికి ఎదిగాడు. అతడి కొలీగ్స్ మాత్రం అంతంత మాత్రం కెరీర్ తో సరిపెట్టుకున్నారు.
Yeh anurag forgets me n talks nonsense… ask others those who involved with him… he is nothing but fool Anuragkashyab…. fool remauns fool..
— N.Nataraja Subramani (@natty_nataraj) June 4, 2020