ఫస్ట్ లుక్ :రాజమౌళి కుమారుడు `ఆకాశ‌వాణి` థీమ్ పోస్టర్

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి కుమారుడు కార్తికేయ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఆయన “షోయింగ్ బిజినెస్” అనే పేరు తో నిర్మాణ సంస్థ స్థాపించారు. తొలిసారి కార్తికేయ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం `ఆకాశ‌వాణి`. రాజ‌మౌళి వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌ని చేసిన అశ్విన్ గంగ‌రాజు ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రం థీమ్ పోస్టర్ ని విడుదల చేసారు. మీరు ఇక్కడ ఆ పోస్టర్ ని చూడవచ్చు.

ఈ సినిమా ఫస్టు లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన సందర్భంగా రాజమౌళి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ .. ” ఈ సమయంలో నా కంటే ఆనందపడేవాళ్లు ఎవరుంటారు? కార్తికేయ .. కాలభైరవ ఈ సినిమాకి నిర్మాతగా ..సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నందుకు చాలా హ్యాపీగా వుంది. ఇక అశ్విన్ గంగరాజు నా దగ్గర ఇంతకు ముందు అసిస్టెంట్ గా పనిచేశాడు. మొత్తం టీమ్ కి గుడ్ లక్ ” అని చెప్పారు.

 

కీరవాణి కుమారుడు కాలభైరవ ఈ సినిమాకి సంగీతం అందించనున్నాడు. కాలభైరవ మంచి సింగర్ .. ‘బాహుబలి 2’లో ‘దండాలయ్యా ..’.. ఇటీవల వచ్చిన ‘అరవింద సమేత’లో ‘పెనిమిటీ ..’ పాటలను ఆయనే ఆలపించాడు. బాగా పాప్యులర్ అయిన ఈ పాటలు ఆయనకి మంచి పేరును తీసుకొచ్చాయి. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

ప్రముఖ ర‌చ‌యిత సాయిమాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు అందిస్తుండ‌గా, సురేశ్ ర‌గుతు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్ర‌హీత శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఈ చిత్రానికి ఎడిట‌ర్‌. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ మూవీగా పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్క‌బోయే ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌న‌వ‌రి నుండి ప్రారంభం అవుతుంది. త్వ‌ర‌లోనే మిగ‌తా న‌టీన‌టుల వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తారు.

ఈ చిత్రానికి సౌండ్ డిజైన్‌: ర‌ఘునాథ్‌.కె, కాస్ట్యూమ్స్‌: సంజ‌నా శ్రీనివాస్‌, కాస్టింగ్ డైరెక్ట‌ర్‌: మ‌హ‌తి బిక్షు, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: మోహ‌న్ నాథ్ ఎస్‌.బింగి, లైన్ ప్రొడ్యూస‌ర్‌: శ‌శాంక్‌, స్క్రీన్ ప్లే: అశ్విన్ గంగ‌రాజు, సందీప్ రాజ్‌, సాయికుమార్ రెడ్డి, నిర్మాత‌: ఎస్‌.ఎస్‌.కార్తికేయ‌, ద‌ర్శ‌క‌త్వం: అశ్విన్ గంగ‌రాజు.