నటి తో అసభ్య ప్రవర్తన : ఇద్దరిపై పోలీస్ కేసు

తెరపై చూసే ఆమె కళ్లదెటే కనిపించేసరికి వాళ్లకు ఒళ్లుపై తెలియలేదు. ఆమెతో మిస్ బిహేవ్ చేసారు. చివరకు కటకటాలు లెక్కించాల్సిన పరిస్దితి తెచ్చుకున్నారు. ప్రముఖ కన్నడ నటి హర్షిక పునాచాతో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే కర్ణాటకలోని మడికెరిలోని నీరుకెల్లు రిసార్ట్ లో ఎంగేజ్ మెంట్ ఫంక్షన్ కి నటి హర్షిక మరో నటుడు భువన్ తో కలిసి వెళ్లింది. ఈ సమయంలో నానయ్య, బిపిన్ ఆమెతో అనుచితంగా ప్రవర్తించారు. దాంతో పెద్ద గొడవైంది. ఈ గొడవలో భువన్ కి గాయాలు అయ్యాయి. స్థానిక ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత ఆమె తన ఫ్రెండ్ తో కలిసి బెంగళూరు వెళ్లిపోయారు.ఆ తర్వాత హర్షిక పోలీస్ కేసు పెట్టారు.

కేసు నమోదు చేసి ఒకరిని అరెస్ట్ చేశామని పోలీస్ లు అన్నారు. అనుచితంగా ప్రవర్తించిన వాళ్లిద్దరూ సోదరులు అని చెప్పారు. అంతేకాదు భువన్ కు బంధువులు అవుతారని వివరించారు. నిందితులపై ఐపీసీ 354, 324, 326 సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు.