కోట్ల హృదయాల కొణిదెల సింహం
63 ఏళ్ళ ఆజానుభాహుడు, అంజనాదేవి సుపుత్రుడు, ప్రేక్షకుల రారాజు “ప్రాణం ఖరీదు” ఎంతో తన జీవితం చూస్తే తెలుస్తుంది. స్వయంకృషితో ఎదిగే ఛాలెంజ్ విసిరి మగమహారాజులా తెలుగుతెరపై స్వశక్తితో ప్రేక్షకుల గుండెల్లో మెగాస్టార్ గా స్థిరపడిపోయారు. నిర్మలమైన మనస్సుతో నింగిదాకా నిలిచినా నిగర్విగా నిత్య కృషీవలుడిగా, నటచక్రవర్తిగా ఎనలేని సేవలతో మొగల్తూరు మొనగాడిలా పద్మభూషణ్ తో జగదేకవీరుడిలా జనం మెచ్చిన కధానాయకుడు కొణిదెల శివశంకర వరప్రసాద్.
అలనాడు సుధాకర్ కనుసైగ చేసిన మేలుతో వెండిపర్వతంపై మేరు పర్వతంలా మెలుగుతున్నాడు. పట్టుదల, శ్రమ, అకుంటిత దీక్ష, ఆకలి ఆయుధంగా పోరాడిన అసమాన ప్రతిభాశాలి మన చిరంజీవిగారు.
ఎన్నో ఒడిదుడుకులు మరెన్నో అవాంతరాలు అన్నింటికీ ఒకే సమాధానం. తన నటన, నృత్యాలు, హావభావాలు అన్నింటికీ మించి ఎంత ఎదిగిన ఒదిగే తత్వం. నాటి నుండి నేటి వరకు ఎందరో నటీ నటుల జీవితాల ఊపిరి అతడు. నవరసాలతో ప్రేక్షకుడికి ఆయువు పోసి చలనచిత్ర పరిశ్రమ గర్విస్తున్న నటుడిగా, దిక్సూచిగా…మూడువేలకు పైగా అభిమాన సంఘాలతో అహర్నిశలు సేవలతో, ప్రేక్షకుల ఆశీస్సులతో అగ్ర కథా నాయకుడిగా “సైరా నరసింహారెడ్డి అంటున్న జై చిరంజీవి గారికి విష్ యు ఏ వెరీ హ్యాపీ బర్త్ డే”.
-వెంకట్