ఇక్క‌డంతా ఓపెన్..దాచుకోవ‌డం ఏమీ ఉండ‌దు!

ఇక్క‌డ అంతా ఓపెన్. దాప‌రికాలంటూ ఏమీ ఉండ‌వు. బ‌య‌ట‌కు వెళ్లాల‌న్నా? స‌్నేహితుల‌తో తిర‌గ‌లాన్నా? ఎంజాయ్ చేయాల‌న్నా? చివ‌రికి ఎవ‌రికైనా ముద్దు పెట్టాల‌న్నా? ఆ ముద్దులో అనుభూతి చెప్పాల‌న్నా? అంతా ఓపెన్ దాచేసుకోవ‌డాలంటూ ఏమీ ఉండ‌వు. అవును ఇలాగే మాట్లాడుతోంది హాట్ `ఆర్ ఎక్స్ -100` ఫేం బ్యూటీ పాయ‌ల్ రాజ్ పుత్. తొలి సినిమాతోనే హాట్ బ్యూటీగా ఖ్యాతికెక్కిన అమ్మ‌డు అటుపై బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ర‌వితేజ‌, వెంక‌టేష్ లాంటి స్టార్స్ తో స‌హా చిన్న హీరోల చిత్రాల్లోనూ న‌టించింది. ప్ర‌స్తుతం టాలీవుడ్ స‌హా కోలీవుడ్ లోనూ ఓ చిత్రంలో న‌టిస్తోంది.

`ఆర్ ఎక్స్ 100`లో సొగ‌స‌రి బోల్డ్ పెర్పామెన్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. రొమాంటిక్ స‌న్నివేశాల్లో యువ‌త‌ని క‌ట్టిప‌డేసింది. ఆ త‌ర్వాత న‌టించిన రెండు అగ్ర సినిమాలు పెద్ద‌గా ఆడ‌లేదు గానీ…త‌ర్వాత న‌టించిన `ఆర్ డీ ఎక్స్ ల‌వ్` లో మాత్రం మ‌ళ్లీ చెల‌రేగిపోయింది. `ఆర్ ఎక్స్ 100` త‌రహాలోనే `ఆర్ డీ ఎక్స్ ` లోనూ లిప్ లాక్ ల్లో ర‌చ్చ చేసింది. ఆ త‌ర్వాత ప‌రిశ్ర‌మ నుంచి ఇబ్బందులు ఎదుర్కుంది. ఆ సినిమాలు చూసిన కొంత మంది తెలుగు నిర్మాత‌లు క‌మిట్ మెంట్లు అడిగేవార‌ని ప‌బ్లిక్ గానే చెప్పింది. తాజాగా అలాంటి విష‌య‌మే ఒక‌టి చెప్పింది. అమ్మ‌డు ఏ ప‌ని చేసినా ముందుగానే అమ్మ‌కు చెప్పేస్తుందిట‌.

సినిమా విష‌యాల‌న్ని త‌న త‌ల్లికి క‌చ్చితంగా తెలుస్తాయ‌ట‌. ఆ సినిమాలో పాత్రల గురించి ముందే చెబుతుందిట‌. సినిమాలో రొమాంటిక్ స‌న్నివేశాలున్నా…పెద‌వి ముద్దులివ్వాల‌న్నా….బెడ్ రూమ్ సీన్లు ఉన్నా వాట‌న్నింటి గురించి ముందుగానే త‌ల్లితో డిస్క‌స్ చేస్తుందిట‌. అక్క‌డ గ్రీన్ సిగ్నెల్ ప‌డితేనే ముందుకు క‌దులుతాన‌ని తెలిపింది. త‌ల్లి కదాని సిగ్గు ప‌డ‌టానికి ఏమీ లేదంటోంది. ముందుగానే విష‌యం చెప్పేస్తే త‌ర్వాత ఇంటి నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వు క‌దా! అంటోంది.