బిగ్ అప్డేట్ : “గాడ్ ఫాదర్” ను డబుల్ మెగా ట్రీట్ కి డేట్ ఇదే.!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దాదాపు అన్నీ కూడా బిగ్ మల్టీ స్టారర్ సినిమాలే ఉన్నాయి. అయితే అలా మన తెలుగు మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ కమ్బోలో దర్శకుడు మోహన్ రాజ్ చేస్తున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రం “గాడ్ ఫాదర్”.

తెలుగు మరియు హిందీ భాషల్లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్న ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో దసరా రిలీజ్ కి తీసుకొస్తుండగా ఇప్పుడు అయితే ఒకో రోజు ఒకో అప్డేట్ ని ఇచ్చేస్తున్నారు. అలాగే నిన్నటి నుంచి ఈ సినిమాపై ఫస్ట్ సింగిల్ సాంగ్ పై ఈరోజు అప్డేట్ వస్తుంది అని అంతా అనుకోగా..

ఇప్పుడు ఈ భారీ సినిమా ఫస్ట్ సాంగ్ పై అనుకున్నట్టుగానే మాంచి మాస్ అప్డేట్ బయటకి వచ్చింది. ఈ సినిమాలో ఇద్దరు మెగాస్టార్స్ పై ప్రముఖ డాన్స్ మాస్టర్ ప్రభుదేవాతో చేసిన సాంగ్ ని ఈ సినిమాలో మొదటి సాంగ్ గా రేపు సెప్టెంబర్ 15న రిలీజ్ చేస్తుండగా ఈరోజు సాయంత్రమే ఈ డబుల్ మెగా ట్రీట్ పై ప్రోమో 5 గంటల 5 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టు బిగ్ అప్డేట్ ఇచ్చారు.

మరి దీనితో అయితే ఇప్పుడు ఈ సాంగ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాతో మెగాస్టార్ కి ఒక ఫుల్ లెంగ్త్ సినిమాలా థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.