తల్లిదండ్రులను కోల్పోయిన మన తెలుగు స్టార్స్ ఎవరో తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ మధ్యకాలంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం చాలావరకు మూగబోయిందని చెప్పవచ్చు. ఈ మధ్యనే కృష్ణంరాజు మరణించగా ఇటీవలే మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణించారు. ఇక ఇదంతా పక్కన పెడితే.. ఇప్పటికే కన్న తల్లిదండ్రులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మన తెలుగు స్టార్ సెలబ్రెటీలు ఎవరో చూద్దాం.

హీరో రాజశేఖర్: ఈయన తల్లి ఆండాలు వరదరాజన్ 2017 లో చనిపోవడం జరిగింది. తర్వాత కొంతకాలానికి తండ్రి వరదరాజన్ గోపాల్ ని కోల్పోవడం జరిగింది.

కమెడియన్ అలీ: ఈయన తల్లి జుబేదా 2019లో మరణించడం జరిగింది. ఇక ఈయన తండ్రి చాలా కాలం క్రితమే చనిపోయారు.

హీరో ప్రభాస్: ఇతని తండ్రి ఓప్పలపాటి సూర్యనారాయణ ప్రముఖ నిర్మాత. 2010లో మరణించారు. ఇక పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇటీవలే 2022లో మరణించిన విషయం తెలిసిందే.

అక్కినేని నాగార్జున: ఈయన తల్లి అన్నపూర్ణమ్మ దేవి 2011లో చనిపోవడం జరిగింది. తరువాత తండ్రి అక్కినేని నాగేశ్వరరావు 2014లో స్వర్గస్తులయ్యారు.

హీరో దాసరి అరుణ్ కుమార్: ఇతని తండ్రి దాసరి నారాయణరావు ప్రముఖ సినీ దర్శకుడు, తల్లి దాసరి పద్మని కోల్పోవడం జరిగింది.

జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్: వీరి తండ్రి హరికృష్ణ 2018లో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది.

అల్లరి నరేష్: ఇతని తండ్రి ఇ. వి. వి సత్యనారాయణ ప్రముఖ సినీ దర్శకుడు. 2011లో చనిపోవడం జరిగింది.

విక్టరీ వెంకటేష్: ఈయన తండ్రి దర్శకనిర్మాత డి. రామానాయుడు 2015లో చనిపోవడం జరిగింది.