ఈ బ్యూటీని ఏ స్టార్ హీరో కరుణిస్తాడో !

ఒక్క ఛాన్స్ అనే డైలాగ్ సినిమా ఇండస్ట్రీలోనే అతి పురాతనమైన డైలాగ్ అనుకుంటా. ఈ మాట పలకకుండా హీరో అయినవాళ్లు ఎవ్వరు లేరు అంటే, ఆ మాట విలువ అర్ధం చేసుకోవచ్చు. కానీ ఛాన్స్ వచ్చినా, దాని వల్ల సక్సెస్ వచ్చినా ఇండస్ట్రీలో నిలబడటం చాలా కష్టం. టాలెంట్ కంటే కూడా లాక్కు ముందుడాలి. లక్కు లేకపోతే భారీ హిట్ అందుకున్నాక కూడా ఛాన్స్ రాదు . అలాగే జరిగింది చైతు హీరోయిన్ కి. పైగా సంవత్సరం ఎదురుచూసింది.. చెప్పుకోతగ్గ ఒక్క అవకాశం కూడా రాకపోతే.. పోనీ యాక్టింగ్ రాదా అంటే.. మొదటి సినిమాతోనే మంచి నటి అనిపించుకుంది. సరే గ్లామర్ లేదా అంటే.. ఆ విషయంలో అసలు అనుమానమే లేదనుకోవాలి.

అన్నిటికీ మించి ఈ బ్యూటీ అందాల బొమ్మ కూడా. మరి ఈ బాలీవుడ్ యంగ్ హీరోయిన్ ‘దివ్యాంశ కౌశిక్’కి ఎందుకు అవకాశాలు రాలేదు, ‘దివ్యాంశ కౌశిక్’ అంటే గుర్తు పట్టడం కూడా కష్టమే.. అదే మజిలీ సినిమాలో క్రికెటర్ చైతుకు జోడిగా నటించి మెప్పించిన హీరోయిన్ అంటే వెంటనే గుర్తుకోస్తోంది. మజిలీలో నార్త్ ఇండియన్ అమ్మాయిగా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ దివ్యాంశ అద్భుతంగా నటించింది. కొన్ని సన్నివేశాల్లో చైతుని డామినేట్ కూడా చేసిందని.. ఆ సినిమా రిలీజ్ అప్పుడు ఆమెకు గుడ్ నేమ్ కూడా వచ్చింది. ఆ సినిమా తరువాత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్నారు.

కానీ, సెకండ్ హీరోయిన్ గా మళ్ళీ పెద్ద సినిమాల్లో చాన్స్ లు పట్టలేకపోయింది. కారణం మజిలీలో హీరోయిన్ గా క్రెడిట్ మొత్తం సమంతకే వెళ్ళిపోయింది. పైగా ప్రమోషన్స్ లో, ఇంటర్వ్యూల్లో కూడా ఎక్కువగా సమంత మీదే ఫోకస్ చేశారు. దాంతో దివ్యాంశకు రావాల్సిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ఆ కారణంగానే దివ్యాంశ కౌశిక్ కు పెద్దగా ఆఫర్స్ రాకుండా పోయాయి. ఇప్పటికీ పెద్ద సినిమాల్లో మెయిన్ హీరోయిన్ ఛాన్స్ కోసం ఆశగా ఎదురుచూస్తూనే ఉంది. మరి ఏ స్టార్ హీరో ఈ బ్యూటీ కరుణిస్తాడో చూడాలి.