మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే 152వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో సెట్స్ పైకి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్- కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. మెగాస్టార్ ఇమేజ్ కు ఏమాత్రం తగ్గకుండా కొరటాల మార్క్ చిత్రంగా మలచబోతున్నారు. ఇప్పటికే చిరు పాత్ర చాలా ఆసక్తిగా ఉంటుందన్న ప్రచారం వెడెక్కిస్తోంది. నక్సలైట్ నేపథ్యం..పొలిటికల్ అంశాలను టచ్ చేస్తూ కొరటాల తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నట్లు వినిపిస్తోంది. కాగా ఈ సినిమా సెట్స్ లో ఉండగానే మెగాస్టార్ 153 కోసం ఓ దర్శకుడు కర్చీప్ వేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
హరీష్ శంకర్ ఇటీవలే మెగాస్టార్ ని కలిసారుట. మాటల సందర్భంలో మంచి స్టోరీ ఉంటే సిద్దం చేయ్ సినిమా చేద్దామని చిరు అన్నారుట. దీంతో హరీష్ మెగాస్టార్ మెప్పించేలా ఆయన కోసం ఓ స్ర్కిప్ట్ సిద్దం చేస్తున్నట్లు సమాచారం. స్వయంగా చిరునే ఆ మాట ఆనడంతో మెగాస్టార్ ఇమేజ్ కు ఏమాత్రం తగ్గకుండా….కొన్నాళ్ల పాటు చెప్పుకునేలా పక్కా కమర్శియల్ స్ర్కిప్ట్ సిద్దం చేయాలని హీరష్ స్ర్టాంగ్ గా ఉన్నాడుట. 153 సినిమా తనదే అవ్వాలని కసిగా పని మొదలు పెట్టాడుట. గతంలో హరీష్ మెగా కాంపౌండ్ హీరోలతో గద్దలకొండ గణేష్, డీజే, గబ్బర్ సింగ్ చిత్రాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.