డైరెక్టర్ రాజమౌళి అంటే బాహుబలి నుంచే బాలీవుడ్ మీడియా కూడా చాలా స్పెషల్ గా ఫోకస్ పెడుతోంది. ఒక సినిమా కోసం ఇంతలా కష్టపడతారా అని బహుబలితోనే నీరూపించిన జక్కన్న ఆ విజయం కోసం ఖర్చు పెట్టిన రాత్రులు ఎన్నో ఉన్నాయి. ఆయనతో పాటు టీమ్ సభ్యులు కూడా చాలానే కష్టపడ్డారు. ఇక బిగ్గెస్ట్ మల్టీస్టారర్ RRR కోసం కూడా అలానే కష్టపడుతున్నాడు.
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీలో ప్రతి సీన్ కోసం జక్కన్న తీసుకుంటున్న జాగ్రత్తలు అన్ని ఇన్ని కావు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ కోసం అయితే ఎన్ను గంటలు గడుస్తాయో కూడా ఎవరు చెప్పలేరు. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక లాంగ్ షెడ్యూల్ ను ముగించిన విషయం తెలిసిందే. అందులో షూట్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ 8నిమిషాలే.
అసలైతే మొదట 20రోజుల షెడ్యూల్ మాత్రమే అనుకున్నారట. ఇక ఎంతకైనా మంచిది అని జక్కన్న గురించి ముందే తెలుసు కాబట్టి ప్రొడక్షన్ టీమ్ 30రోజుల షెడ్యూల్ ని ఫిక్స్ చేసుకుందట. కానీ ఊహించని విధంగా ఆ లెక్క 54రోజులకు వెళ్లింది. ఆ మధ్య ఒక వీడియోలో జక్కన్నపై సరదాగా కంప్లైంట్స్ ఇచ్చిన తారక్ ఆయన చెక్కుడుకు మేము బలవుతుంటాం అని తీసిందే తీస్తూ ఉంటాడని చెప్పాడు. ఇక ఇప్పుడు ఈ లాంగ్ షెడ్యూల్ గురించి తెలిశాక నిజంగా పని దగ్గర జక్కన్న ఒక మంచి మొండిఘటమే.. అని జనాలు పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.