త్వ‌ర‌లో  సింగ‌ర్ గా సంప‌త్ నంది!

సంప‌త్ నంది చిన్న‌ప్పుడు చాలా సింగింగ్ కాంపిటీష‌న్స్ లో పార్టిసిపేట్ చేశార‌ట‌. సింగ‌ర్‌గా ఎన్నో ప్రైజులు తెచ్చుకున్నార‌ట‌. అయితే ఎప్పుడూ పాట పాడ‌లేదు. బెంగాల్ టైగ‌ర్ స‌మ‌యంలో ఈ విష‌యం తెలుసుకున్న భీమ్స్ సంప‌త్ చేత పాడించాల‌ని ట్రై చేశార‌ట‌. కానీ ఆయ‌న పాడుతుంటే ఏదోలా ఉంద‌ని అప్ప‌ట్లో వ‌దిలేశార‌ట‌. మ‌ధ్య‌లో కూడా ఓ సారి ట్రై చేశార‌ట‌. కానీ పేప‌ర్ బాయ్ సినిమాకు మాత్రం అలాంటి అటెంప్ట్ లు ఏమీ చేయ‌లేదు. అయితే త్వ‌ర‌లో సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వం వ‌హించే సినిమాకు మాత్రం త‌ప్ప‌కుండా పాట పాడ‌నున్నార‌ట సంప‌త్‌. ఈ విష‌యాన్ని సంగీత ద‌ర్శ‌కుడు భీమ్స్ ఖ‌రారు చేశారు. `సంప‌త్ అన్న చేత త‌ప్ప‌కుండా వ‌చ్చే సినిమాకు పాట పాడిస్తా. ఆయ‌న గొంతులో పాట‌లు బాగా ఉంటాయి“ అని అన్నారు. భీమ్స్ స్వ‌ర‌ప‌ర‌చిన `పేప‌ర్‌బాయ్‌`లోని టైటిల్ సాంగ్‌ను చంద్ర‌బోస్ ఆల‌పించారు. ఇక నెక్స్ట్ టెర్మ్ సంప‌త్ నందిదే అని చెప్పారు.