ఈ కాంబినేషన్  వర్కవుట్  అవుతుందా?!

AlluArjun KoratalaSiva

ఈ కాంబినేషన్ టాలీవుడ్ లో వర్కవుట్  అవుతుందా?!.. ఇప్పుడు టాలీవుడ్ లో ఎవ్వరి నోటా విన్నా ఇదే మాట. తెలుగు చిత్రసీమలో దర్శకుడు కొరటాల శివకు ఓ మంచి పేరుంది.  మొదటి సినిమా నుండి సామాజిక స్పృహ, సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించడం లో కొరటాల శివ తర్వాతే ఎవరైనా. ఓ చిత్రం విడుదల కాకముందే బ్లాక్ బస్టర్ అవుతుంది అని మనకు  కొన్నిటి మీదనే గట్టి నమ్మకం ఉంటుంది. అలా నమ్మకం కలిగించిన దర్శకులలో కొరటాల శివ ఒకరు. ఇప్పటికే మెగాస్టార్ తో  ‘ఆచార్య’ సినిమాతో లైన్ లో  ఉన్న కొరటాల, అల్లు అర్జున్ తో ఓ సినిమా ప్రకటించారు.

అయితే అల్లు అర్జున్ తో తీస్తున్న సినిమా కోసం  యువసుధ ఆర్ట్ అనే సంస్థ ద్వారా  కొత్త నిర్మాతలను పరిచయం చేస్తున్నారు కొరటాల. ప్రొడక్షన్ వన్ పేరిట అనౌన్సు మెంట్ పోస్టర్ సైతం విడుదల అయింది. అల్లు అర్జున్  ‘అలా వైకుంఠ పురం లో..’ చిత్రం బ్లాక్ బస్టర్ విజయంతో మాంచి ఊపు మీద ఉండగా,’ పుష్ప’ చిత్రం చేస్తున్నారు. ఇపుడు కొత్తగా చేసిన  అనౌన్సు మెంట్ అభిమానులకు  పండగ వాతావరణాన్ని తలపిస్తుంది. ఊహించని ఈ కాంబినేషన్ టాలీవుడ్ లో వర్కవుట్  అయ్యే అవకాశం కనిపిస్తోంది.  అయితే ఈ చిత్రం పై అభిమానులు, ప్రేక్షకులు భారీగా స్పందిస్తున్నారు.

మోస్ట్ అవైటడ్ మూవీ అంటూ కొందరు చెబుతున్నారు. ఈ చిత్రం కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అని అంటున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్, ‘ పుష్ప’ చిత్రం షూటింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. లాక్ డౌన్ కారణం గా వాయిదా పడిన ఈ చిత్రం, త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే కొరటాల శివ సైతం ఆచార్య చిత్రం కోసం పని చేస్తున్నారు. అయితే ఈ చిత్రం అనంతరం వీరి సినిమా మొదలయ్యే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.