మెగా మల్టీస్టారర్ పై క్లారిటీ ఇచ్చిన కొరటాల శివ

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆచార్య ఒకటి. అసలైతే ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. గత కొంత కాలంగా షూటింగ్ క్యాన్సిల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక మెగాస్టార్ మొదలు పెట్టినప్పటి ఇంకా ఊపందుకోలేదు. దర్శకుడు కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చరణ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

This is what Charan will be playing in Acharya?

అయితే ఆచార్య సినిమాలో రామ్ చరణ్ పాత్రపై అనేక రకాల రూమర్స్ వస్తుండగా ఫైనల్ గా దర్శకుడి ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. సినిమాలో రామ్ చరణ్ ది గెస్ట్ రోల్ అనేది అబద్దమట. ఫుల్ లెన్త్ రోల్ అని కొరటాల ఒక క్లారిటీ ఇచ్చేశారు. మెగాస్టార్ చిరంజీవి పాత్రతోనే సమానంగా రామ్ చరణ్ క్యారెక్టర్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటుందని మెగాస్టార్ వల్లే ఈ కాంబినేషన్ సెట్టయినట్లు చెప్పారు.

ఇక రామ్ చరణ్ ఇప్పటివరకు షూటింగ్ లో అయితే పాల్గొనలేదట. త్వరలో స్టార్ట్ కానున్న ఒక కీలక షెడ్యూల్ లో రామ్ చరణ్, మెగాస్టార్ మధ్యన సన్నివేశాలను షూట్ చేయనున్నట్లు కూడా దర్శకుడు వివరణ ఇచ్చాడు. ఇక సినిమాకు సంబంధించిన టీజర్ ఎప్పుడు వస్తుందనే విషయంలో ఇంకా దర్శకుడు క్లారితో ఇవ్వలేదు. కానీ న్యూ ఇయర్ కు ఒక సర్ ప్రైజ్ ఉంటుందని రూమర్స్ అయితే గట్టిగానే వస్తున్నాయి. చూడాలి మరి ఎలాంటి సర్ ప్రైజ్ ఇస్తారో..