స్టార్ హీరోల సినిమాలకు సంభందించిన ఫొటోలు, వీడియోలు, పాటలు లీక్ అవటం అనేది ఈ మధ్య సర్వ సాధారణంగా మారింది. సర్లే లీక్ అయిన మ్యాటర్ గమనించి ..త్వరగా చర్యలు తీసుకుని క్లోజ్ చేద్దామనుకుంటూంటే సినిమా వాళ్లకు టీవి ఛానెల్స్ నుంచి ఓ కొత్త సమస్య ఎదురౌతోంది.
టీవి ఛానెల్స్ వాళ్ళు అతి తెలివిగా…ఫలానా సినిమాలో ఈ బిట్ లీకైంది..ఫలానా ఫొటో లీకైంది..ఇదిగో ఈ వీడియో లీకైందే అంటూ ఆ వీడియోలు, ఫొటోలు ప్రసారం చేసేస్తున్నారు. దాంతో ఆ లీకైన వీడియోలకు, ఫొటోలకు మరింత ప్రాచుర్యం లభిస్తోంది. ఈ విషయమై దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఆవేదన చెందుతున్నారు. ఆయన ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా పేటా అనే చిత్రం చేస్తున్నారు.
పేటా సినిమాకు సంబంధించిన కొన్ని వీడియోలు, స్టిల్స్ లీక్ అయ్యాయి. అయితే ఈ లీకైన విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అయితే అది కొంతమందికే పరిమితం అయ్యింది. అయితే కొన్ని టీవీ ఛానళ్లు మాత్రం …అందరికీ ఈ లీక్ వీడియోని చూపించాలని కంకణం కట్టుకున్నట్లుగా ఆ వీడియోలు, స్టిల్స్‌ను కూడా ప్రసారం చేయటం మొదలెట్టాయి. ఇది గమనించిన దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ సోషల్‌మీడియా
ద్వారా ఆవేదన తెలియచేసారు.
కార్తీక సుబ్బరాజు మాట్లాడుతూ..‘‘పేటా’ చిత్ర యూనిట్ నుంచి రిక్వెస్ట్. మా సినిమాకు సంబంధించిన స్టిల్స్, వీడియోలు లీకవుతున్నాయి. దయచేసి వాటిని ఎవరూ షేర్ చేయకండి. మీ అందరి సపోర్ట్ కావాలి. కొన్ని మీడియా ఛానళ్లు లీకైన వీడియోలను,ఫొటోలను చెప్తూ..వాటిని అదే పనిగా ప్రసారం చేయటం గమనించారు. ఇదే విధంగా… మున్ముందు పైరసీకి గురైన సినిమాలను కూడా వార్తలుగా ప్రసారం చేస్తారా? ఇది అనైతికం అనిపించటం లేదా’ అని ట్విటర్‌లో ఆయన ఆవేదనతో ట్వీట్ చేసారు. మరి టీవి ఛానెల్స్ వారు ఏమంటారో..ఎలా స్పందిస్తారో చూడాలి.