Home Tollywood దిల్ రాజు పెళ్లి లో టాలీవుడ్ అతిధులా?

దిల్ రాజు పెళ్లి లో టాలీవుడ్ అతిధులా?

నిర్మాత దిల్ రాజు నిజామాబాద్ లో ఆదివారం రెండ‌వ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. కుమార్తె హ‌న్షిత కొరిక మేర‌కు రాజుగారు ఈ వివాహానికి ఒప్పుకున్న‌ట్లు..ఆమె బ‌లవంతం మీద‌నే పెళ్లి జ‌రుగిన‌ట్టు తెలుస్తోంది. వివాహం అనంత‌రం కుమార్తె ప్ర‌త్యేకంగా తండ్రికి శుభాకాంక్ష‌లు తెలిపింది. వివాహం కేవ‌లం కుటుంబ స‌భ్యులు..కొద్ది మంది స‌న్నిహితుల స‌మక్షంలోనే జ‌రిగిన‌ట్లు తెలిసింది. అయితే టాలీవుడ్ నుంచి మాత్రం ఇద్ద‌రు డైరెక్ట‌ర్లు హాజ‌రైన‌ట్లు తాజాగా వెలుగులోకి వ‌చ్చింది.

యంగ్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి, హారిష్ శంక‌ర్ వివాహానికి హాజ‌రైన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. రెండ‌వ వివాహం కావ‌డంతో పెళ్లి సింపుల్ గా జ‌రిగిపోయింద‌ని…రాజుగారితో పెళ్లికి అనీల్, హారీష్ వెళ్ల‌డంతో మ‌రింత చ‌ర్చ‌కు దారి తీస్తోంది. రాజుగారికి ప‌రిశ్ర‌మ‌లో కావాల్సిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, హీరోలు, టెక్నీషియ‌న్లు అంద‌రితోనూ రాజుగారు చ‌నువుగా మెలుగుతారు. వాళ్ల‌పై జోకులేంత చ‌నువు రాజుగారికి ఉండ‌నే ఉంది. అయితే పెళ్లికి వాళ్లంద‌ర్నీ ప‌క్క‌నబెట్టి కేవ‌లం హారీష్ శంక‌ర్, అనీల్ రావిపూడి ఆహ్వానించ‌డంతో రాజుగారితో వాళ్లిద్ద‌రి బాండింగ్ మిగ‌తా వాళ్ల‌కంటే బ‌లంగా ఉంద‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది.

అనీల్ మంచి కామెడీ ప‌ర్స‌న్. జోకులు వేసి అంద‌ర్నీ న‌వ్విస్తుంటారు. రాజుగార్నీ అలా చాలాసార్లు న‌వ్వించాడు. ఇక అనీల్ తో వ‌రుస‌గా సినిమాలు చూస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో రాజుగారు వ్య‌క్తిగ‌తంగా వివాహానికి పిలిచిన‌ట్లు స‌మాచారం. అలాగే హారీశ్ శంక‌ర్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌నిచేసే టైమ్ లోనే రాజుగారితో స‌న్నిహితంగా ఉండేవాడుట‌. అప్ప‌టి నుంచి ఇద్ద‌రి మ‌ధ్య మంచి స్నేహం ఉంద‌ని….డైరెక్ట‌ర్ అయిన త‌ర్వాత ఆ బాండింగ్ మ‌రింత స్ర్టాంగ్ అయింద‌ని ఈ సంద‌ర్భంగా తెలుస్తోంది. అయితే పెళ్లి వేడుక‌లో అనీల్..హారీష్ శంక‌ర్ ఉన్న‌ట్లు ఫోటో రూపంలో ఎలాంటి ఆధారం లేదు.

Related Posts

తప్పదిక.. పెద్ద సినిమాలు తాడో పేడో తేల్చుకోవాల్సిందే.!

'లవ్ స్టోరీ' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంచి టాక్ సంపాదించుకుంది. కష్టకాలంలో తెలుగు సినిమాకి ఊరటనిచ్చింది 'లవ్ స్టోరీ' రిలీజ్. వాస్తవానికి 'సీటీమార్' ద్వారా ఈ వేవ్ రావల్సి ఉంది. 'సిటీమార్' తరహాలో...

నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ ఊపు తెచ్చిందిగానీ.!

అహహా.. ఎన్నాళ్ళ తర్వాత ఈ సందడి.? అడ్వాన్స్ బుకింగుల జోరు చూసి ఎన్నాళ్ళయ్యింది.? సినీ పరిశ్రమలో జరుగుతున్న చర్చ ఇది. ఔను, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా రూపొందిన 'లవ్...

మేమే గెలుస్తాం: మంచు విష్ణు ధీమా అదిరింది..

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'మా' ఎన్నికల్లో ఇంతకు ముందెప్పుడూ లేనంత గందరగోళం ఈసారి నెలకొన్న మాట వాస్తవం. దానికి కారణమెవరు.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ప్రకాష్ రాజ్ ద్వారా హంగామా మొదలైంది.. అక్కడినుంచే...

Related Posts

Latest News