గత శుక్రవారం విడుదలైన ‘జెర్సీ’చిత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్‌లోనూ మంచి టాక్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా సినిమాకు ఫిదా అయిపోయారు. దాంతో భాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. కథాకథనాలు .. పాత్రలను మలిచిన తీరులో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మంచి మార్కులు కొట్టేశాడని అంతా మెచ్చుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన వైవిధ్యభరితమైన చిత్రంగా ‘జెర్సీ’ని గురించి చెప్పుకుంటున్నారు. ఈ నేపద్యంలో ఈ చిత్రాన్ని హిందీ రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకోవాలనే ఆలోచనలో దిల్ రాజు వున్నట్టు వార్తలువస్తున్నాయి. కరుణ్ జోహర్ కు స్పెషల్ స్క్రీనింగ్ వేసి చూపించటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ స్థాయి సక్సెస్ ను సాధించిందని తెలుసుకున్న కరణ్ జొహార్ కూడా ఈ సినిమా చూడటానికి ఉత్సాహాన్ని చూపుతున్నాడని అంటున్నారు. ఈ సినిమా నచ్చితే అపుడు ఆయన రీమేక్ రైట్స్ విషయంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం వుంది.
మరో ప్రక్క తమిళంలో పేరొందిన నిర్మాణ సంస్ద…లైకా ప్రొడక్షన్స్ వారు తమిళ రీమేక్ రైట్స్ ను దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారట. అందుకు సంబంధించిన సంప్రదింపులు జరుగుతున్నాయని చెబుతున్నారు. మొత్తానికి ‘జెర్సీ’ రీమేక్ హక్కుల కోసం గట్టిపోటీనే వున్నట్టుగా తెలుస్తోంది.