దిల్ రాజు మాటలకు షాక్ అయిన బాలయ్య?
వాస్తవానికి బాలకృష్ణతో చేయాలనేది ప్రముఖ నిర్మాత దిల్ రాజు చిరకాల కోరిక. అందుకు సరైన దర్శకుడు బోయపాటి శ్రీను అని కూడా ఆయనకు అర్దమైంది. బోయపాటిని దర్శకుడుగా పరిచయం చేసి భద్ర వంటి హిట్ కొట్టాక మరోసారి ఆయనతో సినిమా చేయలేదు దిల్ రాజు. బోయపాటి కూడా దిల్ రాజు తో అంటే బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయని ఆ క్యాంప్ జోలికి వెళ్లలేదు. కానీ కాలం ఎల్లకాలం ఒకేలా ఉండదు.
రామ్ చరణ్ తో చేసిన వినయ విధేయరామ సినిమా తర్వాత బోయపాటికు సినిమా ఇచ్చేవాళ్ళు లేక దిల్ రాజుని ఎప్రోచ్ అయ్యారు. దిల్ రాజు సైతం బాలయ్యతో సినిమా చేయాలనే కోరిక తీరుతున్నందుకు ఆనందపడ్డారు. అంతాబాగానే ఉంది. అయితే సమస్య అంతా బడ్జెట్ దగ్గరే వచ్చింది. డబ్బై కోట్ల బడ్జెట్ తో దిల్ రాజుని ఎప్రోచ్ అయ్యారు బోయపాటి. ఆ బడ్జెట్ వినగానే వేరే ప్రశ్నలు వేయకుండా అంత పెడితే తన సంస్ధ క్లోజ్ చేసుకోవాల్సిందేనని, లాభం కాదు కదా , అమ్మటం కూడా కష్టమని తేల్చి చెప్పారట. బోయపాటి, బాలయ్య ఇద్దరూ ప్లాఫ్ ల్లో ఉన్నారనే విషయం డైరక్ట్ గా చెప్పకుండా అంతపెట్టి సినిమా చేసి అమ్ముకోవటం తన వల్ల కాదని అన్నారట.
ఈ విషయం బాలయ్యకీ తెలిసి, ఫోన్ చేసి మాట్లాడబోయారట. కానీ దిల్ రాజు మనం మరో ప్రాజెక్టు చేద్దాం…నేను వరస సినిమాలతో మీ సినిమాపై కాన్సర్టేట్ చేయలేనని చెప్పి వద్దన్నారట. దాంతో బాలయ్య షాక్ అయ్యారట. సాధారణంగా బాలయ్య ఫోన్ చేస్తే ఇలా సమాధానం ఇచ్చే నిర్మాత ఉండరు. ఇంతకు ముందు సైతం శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరో గా చేద్దామనుకున్న భారతీయుడు 2 చిత్రం సైతం బడ్జెట్ ఇష్యూలతోనే తప్పుకున్న సంగతి తెలిసిందే.