ఆ సెంటిమెంట్ నే నమ్ముకున్న దిల్ రాజు?

కెరీర్ ప్రారంభం నుంచి వరస హిట్స్ తో తెలుగులో నంబర్ వన్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు దిల్ రాజు. అయితే రీసెంట్ గా ఆయన బ్యానర్ నుండి వచ్చిన ‘శ్రీనివాస కళ్యాణం,లవర్’చిత్రాలు భాక్సాఫీస్ వద్ద దెబ్బ కొట్టడంతో కాస్త వెనుకబడ్డారు. అయితే మళ్లీ ఎలాగైనా బౌన్స్ బ్యాక్ అయ్యి..నెంబర్ వన్ ప్లేస్ లో నిలవాలని తనదైన ఫార్ములా సినిమాని వర్కవుట్ చేసారు.తన సంక్రాంతి సెంటిమెంట్ ని నమ్ముకున్నారు.

మొదట నుంచీ సంక్రాంతి సీజన్ దిల్ రాజుకు బాగా కలిసొచ్చింది. దిల్ రాజు నిర్మించిన గత చిత్రాలు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు , ఎవడు , శతమానం భవతి’ చిత్రాలు సంక్రాంతికి విడుదలయ్యి సూపర్ హిట్ అయ్యాయి. అదే కోవలో ఇప్పుడు మల్టీ స్టారర్ చిత్రం ఎఫ్ 2 కూడా ఆ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తున్నారు. దాంతో ఈ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యి దిల్ రాజుకు మంచి సక్సెస్ ని అందిస్తుందని భావిస్తున్నారు.

కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఫై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. తన బ్యానర్ లో గతంలో ‘సుప్రీమ్ , రాజా ది గ్రేట్’వంటి హిట్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి ని నమ్ముకుని ముందుకు వెళ్తున్నాడు. తాజాగా అనిల్ డైరక్షన్ లో దిల్ రాజు నిర్మించిన చిత్రం ఎఫ్ 2 జనవరి 12న విడుదల అవనుంది.