దీపికావీర్ కళ్యాణం ప్రారంభమైంది

ప్రపంచ వ్యాప్తంగా అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్టార్ కపుల్ దీపిక ,  రణ్వీర్ ల వివాహం ఇటలీలోని లేక్ ప్యాలస్ లో ప్రారంభమైంది . ఈ ఇద్దరి కుటుంబ సభ్యులు , స్నేహితుల సమక్షంలో కొంకిణి సంప్రదాయం ప్రకారం ఈ వివాహ వేడుకలు జరుగుతున్నాయి . ఈ ఇద్దరి  వివాహానికి సంబందించిన వార్త బయటకు వెలువడలేదు . దీనికి కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు .

దక్షిణ భారత సంప్రదాయం ప్రకారం జరిగే ఈ వివాహ వేడుకలు ఎక్కువ సమయం పడుతుంది . దీపికా కన్నడ అమ్మాయి కాబట్టి వారి తల్లితండ్రులు వారి సంప్రదాయం ప్రకారం ముందు ఈ వివాహాన్ని జరిపిస్తున్నారు . రేపు అంటే 15వ తేదీన సంధి సంప్రదాయమ్ ప్రకారం మరో సారి వివాహం జరుగుతుంది .