ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ శరవేగంగా జరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ బయోపిక్‌లో ప్రమోషన్ లో భాగం అన్నట్లుగా ఒక్కో విషయం బయటికి వస్తూ అభిమానుల్లో అంచనాలు పెంచేస్తున్నాయి. తాజాగా మరో విషయం కూడా ఈ చిత్రం మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అదేమిటంటే…ఈ ప్రాజెక్టులో దాసరి నారాయణరావు పాత్ర కోసం తెలుగులో అగ్ర దర్శకుడిని తీసుకుంటున్నాడు క్రిష్. అందులో నిజమెంత
మహానటుడు నందమూరి తారక రామారావు జీవితంలో ప్రముఖ దర్శకుడు దాసరి పాత్ర మరవలేం. ఆయనతో ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు ఇచ్చాడు. ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు తెలుగు సినిమా చరిత్రను తిరగరాసాయి. ముఖ్యంగా “సర్దార్ పాపారాయుడు”.. “బొబ్బిలిపులి” చిత్రాలు ..ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. చరిత్రను తిరగరాసాయి.
ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ బయోపిక్ లో దాసరి నారాయణరావు పాత్రను చూపించవలసిన అవసరం అయితే నిజానికి వుంది. ఈ పాత్రకి గాను దర్శకుడు వినాయక్ అయితే బాగుంటుందని భావించి, ఆయనను ఒప్పించినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దాసరి పాత్ర తేజ డైరక్ట్ చేసేటప్పుడు ఉన్న స్క్రిప్టులో ఉందిట. అప్పుడు చంద్ర సిద్దార్దను ఆ పాత్ర కోసం అనుకున్నారట. అయితే మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం…ఆ పాత్ర సినిమాలోనుంచి క్రిష్ తీసేసారని..వినాయిక్ ని అసలు ఈ ప్రాజెక్టులోకి అనుకోలేదని..అది మీడియా సృష్టించిన గాసిప్ అనే తెలిసింది.