షాక్‌: ద‌ర్బార్ రిలీజ్ వాయిదా

సూపర్ స్టార్ రజనీకాంత్ న‌టించిన‌ `దర్బార్` రిలీజ్ ముందు ఊహించ‌ని ఎదురు దెబ్బ ప్ర‌స్తుతం పంపిణీదారుల‌ను షాక్ కి గురి చేస్తోంది. ఈ సినిమా రిలీజ్ కి తాజాగా మద్రాస్ హైకోర్టు షాక్ నిచ్చింది. ఈ బుధ‌వారం రిలీజ్ కావాల్సిన సినిమా స‌డెన్ గా వాయిదా వేయాల్సిన స‌న్నివేశం నెల‌కొంద‌ని తెలుస్తోంది.

దాదాపు వ‌ర‌ల్డ్ వైడ్ 8 వేల స్క్రీన్స్‌లో ఈ నెల 9న విడుదల కావాల్సిన ఈ చిత్రానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్ప‌టికే సాగిపోయినా చివ‌రి నిమిషంలో ఊహించని ఈ ట్విస్టు ర‌జ‌నీ అభిమానుల్ని క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేసింది. అయితే దీనికి కార‌ణ‌మేమిటి? అంటే.. లైకా ప్రొడక్షన్ 2.0 బ‌కాయిలే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. ద‌ర్బార్ చిత్రాన్ని మ‌లేషియాలో భారీగా రిలీజ్ చేయాల‌ని అనుకుంటే… 2.0కి సంబంధించి మలేషియా సంస్థకు 23 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లు సమాచారం. బకాయిలు చెల్లించకుండా ఆ దేశంలో `దర్బార్` విడుదలపై స్టే విధించాలని, మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. అక్కడ ఈ సినిమా విడుదలకు 4.90 కోట్లను డిపాజిట్ చేయాలని హైకోర్టు తెలిపింది. లేని పక్షంలో మలేషియాలో దర్బార్ సినిమా విడుదలకు అనుమతించబోమని హైకోర్టు వెల్ల‌డించింది.