ఆ ఇద్దరూ ఏం చేశారో తెలిస్తే అవాక్కే!
గొప్ప ప్రతిభావని అయినా 10లక్షల మంది ఇన్ స్టా ఫాలోవర్స్ ని సంపాదించాలంటే ఏళ్ల తరబడి వేచి చూడాలి. బాగా కష్టపడుతున్న అందాల కథానాయికలకు 50లక్షల (5 మిలియన్ల)కు పైగా అభిమానులు ఉన్నారు. ఆకర్షణను బట్టి ఫాలోయింగ్. కానీ చాలా మంది స్టార్ల ఫేక్ ఫాలోవర్స్ గురించి ఇటీవల పెద్ద డిబేట్ నడుస్తోంది. కొందరు డబ్బు పెట్టి లైక్ లు.. ట్వీట్లు కొనుగోలు చేస్తున్నారు.
అంతేకాదు ఇందుకోసం కొన్ని డమ్మీ కంపెనీలు పని చేస్తున్నాయి. సోషల్ మీడియా ఖాతాల్లో అనుచరులను పెంచే సేవలను అందించే దాదాపు 68 కంపెనీలను ముంబై పోలీసులు గుర్తించారు. ఈ భారీ కుంభకోణంలో ఒక ఫ్రెంచ్ సంస్థ ఫాలోయర్ స్కార్ట్ కూడా ఉందని వారు కనుగొన్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రాలను ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది.
లక్షలాది మంది అనుచరులను కలిగి ఉన్న దీపిక, ప్రియాంక ఇద్దరికీ భారీ సంఖ్యలో నకిలీ అనుచరులు ఉన్నారని పోలీసులు గుర్తించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో దీపికకు 50 మిలియన్లు, ట్విట్టర్‌లో 27+ మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా, ప్రియాంకకు ఇన్‌స్టాగ్రామ్‌లో 55+ మిలియన్లు, ట్విట్టర్‌లో 26+ మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ అనుచరులందరూ నిజమైనవారా లేదా అన్నది ముంబై సైబర్ పోలీసులు తేల్చాల్సి ఉంది. సాధ్యమైనంత తొందరలోనే దర్యాప్తును ప్రారంభించనున్నారని తాజాగా రివీలైంది. దీపిక ఇటీవల ప్రభాస్ సరసన అవకాశం అందుకున్న సంగతి తెలిసిందే. ప్రియాంక చోప్రా హాలీవుడ్ సినిమాల్లో వెబ్ సిరీస్ లలో నటించేందుకు సంతకాలు చేస్తోంది.