క్రేజీ న్యూస్.. నిఖిల్ సినిమాకి..ఇవి కనిపెడితే ఆరు లక్షలు మీవే..!

ప్రస్తుతం మన టాలీవుడ్ సినిమాల పరిస్థితి ఎలా మారిందో చూస్తున్నాము. అయితే ఈ పరిస్థితిలో తమ సినిమాలు ఎలా అయినా ఆడియెన్స్ అటెన్షన్ తెచ్చుకోవాలని మేకర్స్ చేస్తున్న పాట్లు అన్ని ఇన్ని కావు చాలా వరకు గ్రాండ్ ప్రమోషన్స్ చేస్తున్నా కూడా ఆడియెన్స్ థియేటర్లు కి రాని పరిస్థితి ఇప్పుడు నెలకొంది.

మరి ఇదిలా ఉండగా ఓ సరైన ప్రమోషన్స్ తో అయితే యంగ్ హీరో నిఖిల్ తన సినిమా “కార్తికేయ 2” తో వస్తున్నాడు. ఈ ఆగస్ట్ 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఒక నిది వేట నేపథ్యంలో తెరకెక్కగా ఇపుడు ఇదే తరహాలో ప్రేక్షకులకి ఒక ఊహించని ఆఫర్ ని తీసుకొచ్చారు.

నాలుగు సిటీలలో వారు బంగారంతో చేసిన కృష్ణ విగ్రహాన్ని దాస్తున్నామని దానిని ఎవరైనా కనిపెడితే అక్షరాలా 6 లక్షల విలువైన ఆ గోల్డెన్ ఐడల్ మీ సొంతం అని ఒక క్రేజీ ఆఫర్ ని తీసుకొచ్చారు. అయితే వీటిపై తాము కొన్ని హింట్స్ కూడా ఇస్తామని ఫస్ట్ హింట్ మరికొన్ని గంటల్లో అందించనున్నామని హీరో నిఖిల్ తెలిపాడు.

ఇది మాత్రం ఆడియెన్స్ కి ఒక సరైన ప్రమోషన్ అని చెప్పాలి. మరి వారు ఇచ్చే హింట్స్ ఏంటో నిజంగానే ఇవి ఎవరైనా గెలుచుకుంటారా లేదా అనేది చూడాలి. అవకాశం ఉంటే మీరైనా సరే ఇందులో పార్టిసిపేట్ చెయ్యొచ్చు. ఇంకా ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ స్టార్స్ కూడా కీలక పాత్రల్లో నటించారు. అలాగే చందు మొండేటి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.