కొరోనావైరస్ మహమ్మారి వల్ల గత కొన్ని నెలలుగా దేశంలో లాక్ డౌన్ తో అల్లాడింది. పలువురు సెలబ్రిటీలకు మహమ్మారీ చుట్టుకోవడం సంచలనమైంది. ఇప్పుడు, నటుడు అమీర్ ఖాన్ సిబ్బంది కూడా COVID 19 పాజిటివ్ అని తేలడంతో మరోసారి బాలీవుడ్ లో కలకలం మొదలైంది. ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురిచేస్తోంది ఈ వార్త. అమీర్ స్వయంగా ఈ సంగతిని వెల్లడించడంతో టెన్షన్ వాతావరణం అలుముకుంది. తన సిబ్బందిలో కొంతమంది పాజిటివ్ రాగానే ముంబై మున్సిపల్ శాఖ BMC వెంటనే స్పందించి తదుపరి కార్యాచరణకు దిగిందని తెలిపారు.
అమీర్ సహా అతని కుటుంబానికి పరీక్షలు జరపగా నెగెటివ్ వచ్చిందని అమీర్ వెల్లడించారు. ఇంకా తన తల్లి జీనత్ హుస్సేన్ కి వైరస్ పరీక్షలు నిర్వహించలేదని వెల్లడించారు. అమీర్ ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఓ బ్లాక్ బస్టర్ హాలీవుడ్ మూవీకి రీమేక్.
అమీర్ ఖాన్ ట్విట్టర్ లో ఈ మ్యాటర్ వెల్లడించారు. “ప్రస్తుతం నా సిబ్బంది నిర్బంధంలో ఉన్నారు. BMC అధికారులు వారిని వైద్య సదుపాయం అందజేస్తున్నారు. పరిసరాల్ని క్రిమిరహితం చేసినందుకు నేను BMC కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇతరులు అంతా సేఫ్. ప్రస్తుతం నేను నా తల్లిని పరీక్షించటానికి తీసుకువెళుతున్నాను. అమ్మకు ఏ సమస్యా రాకూడదని దయచేసి ప్రార్థించండి. కోకిలాబెన్ ఆసుపత్రికి .. అక్కడి వైద్యులు, నర్సులు .. ఇతర సిబ్బందికి ధన్యవాదాలు“ అని తెలిపారు.
బాలీవుడ్ సెలబ్రిటీలలో, జాన్వి కపూర్ సిబ్బంది .. కరణ్ జోహార్ సిబ్బంది COVID 19 పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దీనికి సంబంధించి బహిరంగంగానే కరణ్.. జాన్వీ ప్రకటనలు విడుదల చేశారు. బాలీవుడ్ నటుడు కిరణ్ కుమార్, గాయని కనికా కపూర్ కూడా కొంతకాలం క్రితం వైరస్ బారిన పడ్డారు. ఆ తర్వాత చికిత్సతో కోలుకున్న సంగతి విధితమే.
https://twitter.com/aamir_khan/status/1277850257653555205