సుశాంత్ కుటుంబంపై దెబ్బ మీద దెబ్బ
ఒక ఘటన.. దానికి సీక్వెన్స్ ఘటనలు తీవ్రంగా బాధించేవిగా ఉంటాయి. సుశాంత్ సింగ్ ఆదివారం నాడు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న అతడి వదిన సుధాదేవి అదే పనిగా రోజంతా ఏడ్చి నీరసించిపోయారట. దాంతో తీవ్ర ఒత్తిడికి గురై అనారోగ్యానికి మందులు వేసుకోకుండా ఉండడం వల్ల ఆకస్మికంగా మరణించారు. దీంతో సుశాంత్ కుటుంబంలో మరో విషాదం ఇంకా కుంగుబాటుకు గురి చేసింది. సుధా దేవి సుశాంత్ కి కజిన్ బ్రదర్ వైఫ్. వారు పూర్ణియా (బిహార్)లో నివసిస్తున్నారు.
అంతేకాదు.. సుశాంత్ ఆత్మహత్య వ్యవహారంపై సందేహాలున్నాయని ఇది హత్య అని అతడి బావ గారు ఓపీ సింగ్ ఫిర్యాదు చేశారు. హత్య అంటూ ఆయన ఆరోపిస్తున్నారు. ఇక సుశాంత్ ఆత్మహత్యను జీర్ణించుకోలేని తన సోదరి రెండ్రోజులుగా ఎంతో కలతతో ఉన్నారు. ఇక తండ్రి తీవ్ర కలతతో ఆస్పత్రి పాలయ్యారు. ప్రస్తుతం ఆయనకు ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. ఒక మరణం ఆ వెంటే విషాదంతో ఆ కటుంబం కోలుకోలేని స్థితికి వెళ్లిపోయింది.