ఇండస్ట్రీలో ఉన్నది ఉన్నట్లు కుండా బద్దలు కొట్టినట్టు మాట్లాడే అతి కొద్ది మందిలో పృద్వీ ఒకరు.తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృద్వీ బిగ్ బాస్ షో గురించి అనే సంచలన వ్యాఖ్యలు చేసారు.గతంలో గ్రామాల్లో పెళ్లిళ్లు జరిగేటప్పుడు పెళ్ళికి వచ్చిన వారంతా ఒక చోట చేరతారని అలాంటిదే బిగ్ బాస్ అని పృద్వీ అన్నారు.అసలు బిగ్ బాస్ వల్ల ఎవరికి ఉపయోగం లేదని,జనాళ్లను పిచ్చోళ్లను చేస్తున్నారని అన్నారు.ఆడొచ్చి దీన్ని గిల్లడం,ఈడొచ్చి దాన్ని కదిలిచ్చడం పని పాట లేని ఈ షో వల్ల ఎవడికి ఉపయోగం లేదని,డబ్బులు తీసుకొని ఇవా చూపించేదని పృద్వీ అన్నారు.ఒక వేళా తాను బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వెళితే తనకు నిద్దరలో లేచే అలవాటుందని లేడీస్ పక్కన పడుకుంటే గోల అవుతుందని సెటైర్ వేశారు.బిగ్ బాస్ లో కెళ్ళి అక్కడున్న వారిని కడిగేస్తానని అన్నారు.బిగ్ బాస్ లో కరెక్ట్ మజా రావాలంటే తనతోపాటు పోసాని,కే.ఏ పాల్ లను వైల్డ్ కార్డు ఎంట్రీలతో లోపలికి పంపాలని చమత్కరించారు.తాను సాయంత్రం 6 గంటలకు ధ్యానం చేస్తానని ఆ తర్వాత రెస్ట్ తీసుకుంటానని,అర్ధరాత్రి వరకు ట్యాంక్ బండ్ మీద తిరిగే బ్యాచ్ కాదని సెటైర్ వేశారు.