సినిమాల నుంచి విరామం తీసుకున్నా !

హీరోయిన్ అనుష్క శర్మ కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క సినిమా లేకపోవడం విశేషం. 2018 లో విడుదలైన ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ ‘జీరో’ సినిమా తర్వాత అనుష్క ఏ సినిమాలో నటించలేదు. ఈ నేపథ్యంలో సినిమాలకు దూరంగా ఉండటంపై స్పందించారు అనుష్క. విరాట్‌ కోహ్లితో వివాహం తర్వాత వరుసగా సినిమాలతో బీజీగా ఉండడంతో, కుటుంబంతో కలసి ఉండే సమయం తగ్గిందని, అందుకే సినిమాలకు కాస్తా విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రెండు మూడు నెలలు విరామం తీసుకొని కుటుంబంతో, విరాట్‌తో సమయం గడుపుతున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం తమపై మరో ప్రాజెక్టు చేయాలనే ఒత్తిడి ఉన్నప్పటికీ ఇలాంటి రంగాల్లో పనిచేసేవారికి సమయానికి తగిన విశ్రాంతి కూడా అవసరమని స్పష్టం చేశారు.