చిరంజీవితో త్రివిక్రమ్ … ప్రకటించారు

త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చిరంజీవి సినిమా చెయ్యబోతున్నాడు . ఈ విషయాన్ని చిరంజీవే స్వయంగా ప్రకటించాడు . రామ చరణ్ నటించిన వినయ  విధేయ రామ సినిమాప్రీ రిలీజ్ కార్యక్రమంలో  చిరంజీవితో పాటు త్రివిక్రమ్ కూడా గెస్టు గా పాల్గొన్నాడు .

త్రివిక్రమ్ శ్రీనివాస్ మెగా స్టార్ చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగానని , క్రమ శిక్షణ ఏర్పడటానికి పరోక్షంగా చిరంజీవే కారణమని చెప్పాడు . అంతే కాదు మెగా కుటుంబం ఎంత ఎదగడానికి కారణం చిరజీవి కృషి , అంకిత భావమే కారణమని చెప్పాడు .

త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో “అత్తారింటికి దారేది “లాంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చాడు . అదే త్రివిక్రమ్ రెండవసారి “అజ్ఞాత వాసి “లాంటి సూపర్ ఫ్లాప్ కూడా ఇచ్చాడు . ఈ సంవత్సరం జూనియర్ ఎన్టీఆర్ తో “అరవింద సమేత  వీర రాఘవ ” అనే సినిమాతో త్రివిక్రమ్ దర్శకుడుగా తనని తను ప్రూవ్  చేసుకున్నాడు .

అరవింద సామెత … సినిమా జూనియర్తో పాటు త్రివిక్రమ్ కు కూడా మంచి పేరు సంపాదించి పెట్టింది . బహుశా చిరంజీవి దీనికి దృష్టిలో పెట్టుకొని తన 152 వ చిత్రానికి దర్శకుడుగా త్రివిక్రంను ప్రకటించాడు . సైరా  సినిమా  నిర్మాణం పూర్తి అయిన తరువాత ఈ సినిమా షూటింగ్ మొదలు కావచ్చు .

ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ చిత్రం కథా చర్చల్లోనే ఉన్నట్టు తెలుస్తుంది . దీని గురించి పూర్తి వివారాలు తెలియవలసి వుంది .