బాక్సాఫీస్ ముందుకు ర‌ప్ఫాడించేసే కాంబినేష‌న్?

మెగాస్టార్ చిరంజీవి-లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి అప్ప‌ట్లో చాలా సినిమాల్లో క‌లిసి న‌టించారు .దాదాపు 21 చిత్రాల్లో ఈ జంట ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. అప్ప‌ట్లో ఈ కాంబినేష‌న్ అంటే ప్ర‌త్యేక‌మై క్రేజ్ . త‌ర్వాత కొన్నాళ్ల‌కు ఎవ‌రి లైఫ్ లో వాళ్లు బిజీ అయిపోయారు. విజ‌య‌శాంతి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత పూరిగా సినిమాల‌కు దూర‌మ‌య్యారు. ఇటీవ‌లే స‌రిలేరు నీకెవ్వ‌రుతో ఆమె మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. మంచి క‌థ‌లు దొరికితే క‌చ్చితంగా సినిమాలు కంటున్యూ చేస్తాన‌ని ఆ సినిమా ప్ర‌మోష‌న్ లో టైమ్ లో వెల్ల‌డించారు. ఇక మెగాస్టార్ ఖైదీ నెంబ‌ర్ 150 రీ ఎంట్రీతో పుల్ బిజీ అయిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య లో న‌టిస్తున్నారు. ఈ సినిమా అనంత‌రం మ‌ల‌యాళం సినిమా లూసీఫ‌ర్ రీమేక్ లో న‌టించ‌నున్నారు. ఈ చిత్రాన్ని యువ ద‌ర్శ‌కుడు సుజిత్ చేతిలో పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం రీమేక్ కు సంబంధించిన ప‌నులు శ‌ర వేగంగా జ‌రుగుతున్నాయి. మెగాస్టార్ సూచ‌న‌లు, స‌ల‌హాలు మేర‌కు రీమేక్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అయితే లూసీఫ‌ర్ లో కీల‌క‌మైన మంజు వారియ‌ర్ పాత్ర ఎవ‌రు పోషిస్తే బాగుంటుంది? అన్న దానిపై కొద్ది రోజులుగా ఫిల్మ్ మీడియాలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. తాజాగా పాత్ర కోసం విజ‌య శాంతి అయితే బాగుంటుంద‌ని చిరంజీవి సూచించారుట‌.

అలాంట‌ప్పుడు చిరు మాట‌ను కాద‌నేది ఎవ‌రు? ద‌ర్శ‌కుడు స‌హా అంతా చిరు చెప్పిన‌ట్లు చేయాల్సిందే. అయితే ఈ విష‌యం ఇంకా విజ‌య శాంతి దృష్టికి వెళ్ల‌లేదుట‌. ఈ నేప‌థ్యంలో విష‌యంపై నేరుగా చిరంజీవినే విజ‌య‌శాంతిని సంప్ర‌దించ‌నున్నారని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. చిరు మాట‌ను విజ‌య‌శాంతి కాద‌నే అవ‌కాశం లేదు. ఎందుకంటే స‌రిలేరు ప్రీ రిలీజ్ వేడుక‌లో కొన్ని ద‌శాబ్ధాల త‌ర్వాత ఒకే వేదిక‌పై క‌నిపించారు. అప్పుడే నా హీరోయిన్ ఇక్క‌డ ఉండ‌టం ఎంతో సంతోషంగా ఉంద‌ని చిరు స‌ర‌దాగా వ్యాఖ్యానించారు. ప్ర‌తిగా విజ‌య‌శాంతి చిరు ప‌ట్లు అలాగే స్పందించారు. అవ‌కాశం వ‌స్తే మ‌రో సినిమా ఇద్ద‌రు క‌లిసి చేస్తామ‌ని చెప్పారు. మ‌రి ఇప్పుడు లూసీఫర్ రూపంలో చిరు ఛాన్స్ లేడీ సూప‌ర్ స్టార్ ఇంటి త‌లుపు త‌ట్ట‌బోతుంది.