చిరు న్యూలుక్‌..పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్!

చిరు న్యూలుక్‌..పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్!

మెగాస్టార్ చిరంజీవి రోజు రోజుకీ కుర్రాడు అయ్యిపోతున్నారు. ఆయన వయస్సుని జయిస్తున్నారు. తాజాగా ఈ విషయం మరో సారి ప్రూవ్ చేస్తూ చిరు కొత్త లుక్‌లో ఉన్న ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫొటోలను చిరంజీవి కోడలు ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఉపాసన ‘బీ పాజిటివ్‌’ అనే హెల్త్‌ మ్యాగజైన్‌ నడుపుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాగజైన్‌ కవర్‌ పేజీ కోసం చిరు ఫొటోషూట్‌ చేయించారు. ఈ కొత్త లుక్‌లో చిరు అదిరిపోయారంటూ మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. మీరు ఇక్కడ ఆ ఫొటోను చూడవచ్చు.

ఇక చిరు ప్రస్తుతం ‘సైరా నరసింహారెడ్డి’లో నటిస్తున్నారు. తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు, తెలుగు వీరుడు ఉయ్యాడలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా రూపొందుతోంది. సురేందర్‌ రెడ్డి దర్శకుడు. నయనతార, తమన్నా, అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

ప్రస్తుతం పది దేశాలు… 26 ప్రదేశాల్లో… ‘సైరా’ విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులు జరుగుతున్నాయి. క్వాలిటీలో ఏమాత్రం రాజీ పడకుండా శరవేగంగా పనులు సాగుతున్నాయని చెప్తున్నారు. అలాగే, సంగీత దర్శకుడు అమిత్‌ త్రివేదీ నేతృత్వంలో ముంబైలో సాంగ్స్‌ వాయిస్‌ మిక్సింగ్‌ జరుగుతోంది. మరోపక్క నేపథ్య సంగీత దర్శకుడు జూలియస్‌ పేకియమ్‌ నేతృత్వంలో రీ రికార్డింగ్‌ కూడా జరుగుతోంది. అక్టోబరు 2న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.