బుల్లి పవర్ స్టార్‌ను బంధించిన మెగాస్టార్

Chiranjeevi

మెగా స్టార్ చిరంజీవికి తన తమ్ముళ్లంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. అందులోనూ చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటే ఎంత మక్కువో తెలిసిందే. పవన్ కళ్యాణ్ చదువు, ఉండటం దాదాపు చిరంజీవి ఇంట్లోనే జరగడంతో పుత్రసమానుడిగా మారాడు. చిరంజీవి షూటింగ్‌ల కోసం విదేశాలకు వెళ్లినప్పుడు కూడా పవన్ కోసం బొమ్మలను తీసుకొచ్చేవాడని, వాటిని ఇప్పటికీ ఎంతో భద్రంగా దాచుకున్నాడన్న సంగతి తెలిసిందే.

Chiranjeevi First Pic
Chiranjeevi First Pic

అలాంటి పవన్ కళ్యాణ్‌తో చిరంజీవికి ఎన్నో మధురానుభూతులున్నాయి. అందులో ఒకటి తాజాగా తన అభిమానులతో పంచుకున్నాడు. నేడు ప్రపంచ ఫోటో గ్రఫీ దినోత్సవం. ఈ సందర్భంగా ఫోటోగ్రఫీపై మక్కువ ఉన్న చిరంజీవి.. తాను తీసిన మొదటి ఫోటో గురించి చెప్పుకొచ్చాడు. అసలే చిరంజీవికి ఫోటోగ్రఫీ, కెమెరాలపై ఎంతో అవగాహన ఉంటుందని సీనియర్ కెమెరామెన్స్‌ కూడా చెబుతుంటారు. అలాంటి చిరంజీవి ఫస్ట్ తీసిన పిక్ ఏమై ఉంటుందా? అని అందరూ ఎదురుచూస్తుండగా అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు.

నేటి వరల్డ్ డే ఫోటో గ్రఫీ డేని పురస్కరించుకుని ‘ఇవ్వాళ #WorldPhotographyDay నేను మొదటి ఫోటో తీసింది ఇలాంటి #agfa3 కెమెరాతో. ఆ మొదటి ఫోటో మరి కాసేపటిలో.’ అంటూ చిరు మొదటగా ట్వీట్ చేశాడు. ఆపై కొద్ది సేపటికి చిరు తీసిన మొదటి ఫోటోను షేర్ చేస్తూ.. ‘నేను తీసిన మొదటి ఫోటో … … ఈ ఐదుగురిలో ఒక వ్యక్తి మీకు బాగా తెలుసు … …చెప్పుకోండి చూద్దాం. ’ అంటూ క్విజ్ పోటీ పెట్టాడు. అయితే అందులో ఉన్నది బుల్లి పవర్ స్టార్ అని ఇట్టే కనిపెట్టేశారు.