అదిరిపోయిన ‘ఆచార్య’ మోషన్ పోస్టర్.. మెగా ఫ్యాన్స్ కు పండగే ఇక.. ఇది చిరంజీవి సినిమా అంటే

Acharya Movie Motion Poster

మెగాస్టార్ ఎప్పుడైనా మెగాస్టారే. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత కూడా ఆయనలో ఏమాత్రం గ్రేస్ తగ్గలేదు. అదే ఊపు, అదే డ్యాన్స్. ఖైదీ నెంబర్ 150తో మరోసారి తన సత్తా ఏంటో చూపించిన మెగాస్టార్.. ఆ తర్వాత సైరా అంటూ వచ్చి తెలుగు ప్రేక్షకులకు తన పవర్ ఏంటో చూపించారు.

chiranjeevi-152-movie-acharya-first-look-and-motion-poster-released
chiranjeevi-152-movie-acharya-first-look-and-motion-poster-released

మెగా ఫ్యాన్స్ కు మళ్లీ ఎంటర్ టైన్ మెంట్ ను ఇస్తున్నారు చిరు. ఈ వయసులో కూడా సినిమా కోసం తను పడే కష్టం చూస్తే సినిమా అంటే చిరుకు ఎంత ప్రేమో అర్థం అవుతుంది.

ఇక.. తన 152 వ సినిమా ఆచార్య కూడా ప్రస్తుతం రూపుదిద్దుకుంటోంది. కరోనాతో కొంచెం గ్యాప్ వచ్చినా.. సినిమా షూటింగ్ శరవేగంగా జరగనుంది.

తన బర్త్ డే సందర్భంగా ఆచార్య సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. ఈ ఫస్ట్ లుక్ చాలు.. సినిమా రేంజ్ ఏంటో? ఇది మామూలు సినిమా అయితే కాదు అని ఫస్ట్ లుక్ తోనే తెలిసిపోతోంది.

ఆచార్య సినిమాకు కొరటాల శివ దర్శకుడు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ ను మూవీ యూనిట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక.. ఈ సినిమాలో చిరు దేవాదాయ అండ్ ధర్మదాయ శాఖలో పనిచేసే ఓ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. మరో పాత్రలో నక్సలైట్ గానూ నటిస్తారని తెలుస్తోంది. చిరంజీవి డ్యుయల్ రోల్ చేయనున్నట్టు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించనుండగా… రామ్ చరణ్ సరసన రష్మిక మందన్న నటించనున్నారు.

ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ తో పాటుగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్  రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం ప్రత్యేకంగా దేవాలయం సెట్ వేయనున్నారు.