‘ఎఫ్‌2’డిలీట్‌ సీన్‌: చూస్తే నవ్వు ఆపుకోలేరు!

పండగ సీజన్ కు ఫెరఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా వచ్చి సూపర్ హిట్టైన చిత్రం ‘ఎఫ్-2’. వెంకటేష్-వరుణ్ తేజ్ క్రేజీ కాంబినేషన్లో దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. ఈ చిత్రం కలెక్షన్స్ రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అయ్యినా ఇప్పటికీ కొన్ని సెంటర్లలో ఆడుతూ దుమ్ము రేపుతున్నాయి.

ముఖ్యంగా సంక్రాంతి బరిలో విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు , పేట , వినయ విధేయ రామ చిత్రాలు ఘోర పరాజయం సాధించడంతో ఎఫ్ 2 కు బాగా కలిసి వచ్చింది ఎఫ్ 2 ఇప్ప‌టికే దాదాపు 80 కోట్ల మేర షేర్ రాబ‌ట్టింది. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో ప్రత్యక్ష్యమైన ఈ చిత్రం నుంచి డిలేటెడ్ సీన్స్ ని వదిలారు. ఆ సీన్స్ చాలా ఫన్నీగా ఉన్నాయి. మీరు ఇక్కడ వాటిని చూడవచ్చు.

F2 Deleted Comedy Scene 1 - Venkatesh, Tamannah, Mehreen | Anil Ravipudi, Dil Raju

చిత్రం లెంగ్త్ కారణంగా తొలగించిన కొన్ని సీన్స్ ను చిత్ర యూనిట్ ఫ్యాన్స్ తో పంచుకుంది. ‘మోర్‌ సీన్స్‌.. మోర్‌ ఫన్‌’ ‘ఎఫ్‌2’లో డిలీట్‌ చేసిన సన్నివేశాలివే! అని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ఆ వీడియోను విడుదల చేసింది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించారు. దాదాపు రూ.140కోట్లకు పైగా ఈ సినిమా వసూళ్లను సాధించింది.