నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా (106 వ చిత్రం) బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఫైనల్ కు చేరుకున్నాయి. నటీనటులు…సాంకేతిక నిపుణులకు సంబంధించి ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఫిబ్రవరి 15 నుంచి రెగ్యులర్ షూట్ కు వెళ్లడానికి రెడీ అవుతున్నారు. ఈసారి బాలయ్య కు ఇద్దరు హీరోయిన్లు ఫిక్స్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఒక హీరోయిన్ గా బోయపాటి ఆస్థాన నాయిక కేథరీన్ ట్రెసాను ఎంపిక చేసినట్లు ప్రచారంలోకి వచ్చింది.
బోయపాటి సెంటమెంట్ గా భావించే కేథరీన్ తీసుకున్నట్లు గుసగుసలు వినిపించాయి. అయితే అమ్మడిపై ఎంపికపై ఓ ఆసక్తికర వార్త వెడెక్కిస్తోంది. అనివార్య కారణాల వల్ల కేథరీన్ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలిసింది. ఆమె ఎగ్జిట్ కి కారణాలు ఏంటన్నవి తెలియదు గానీ….ఆమె స్థానంలో బాలీవుడ్ మోడల్ రంగంలోకి దించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. క్యాథరీన్ ఎంపికపై బాలయ్య అయిష్టం గా ఉన్నట్లు లీకులందుతున్నాయి. అయితే క్లారిటీ రావాల్సి ఉంది. సెట్స్ కు వెళ్లడానికి రెడీ అవుతోన్న సమయంలో ఈ వార్త క్యాథరీన్ అభిమానులకు షాకింగే.